Hundi: దేవుడి హుండీలో కానుకలు వేస్తున్నారా.. అయితే ఎంత వెయ్యాలో మీకు తెలుసా?
దేవుడికి సమర్పించే డబ్బులకు కూడా ఒక నియమం ఉంటుంది అన్న విషయం చాలామందికి తెలియదు.
- By Anshu Published Date - 04:30 PM, Tue - 30 July 24

మాములుగా మనం తరచూ దేవాలయాలకి వెళుతూ ఉంటాం. కొందరు నిత్యం గుడికి వెళ్తే మరికొందరు కేవలం వారంలో కొద్ది రోజులు మాత్రమే వెళుతూ ఉంటారు. ఇంకొందరు కేవలం ప్రత్యేక రోజులలో మాత్రమే దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా మనం దేవాలయంలో హుండీలో డబ్బులు వేస్తూ ఉంటాం. ఎవరికి తోచిన విధంగా వారు వారి స్తోమత కొద్దీ డబ్బులు వేస్తూ ఉంటారు. అయితే దేవుడికి సమర్పించే డబ్బులకు కూడా ఒక నియమం ఉంటుంది అన్న విషయం చాలామందికి తెలియదు. మీరు విన్నది నిజమే.
మరి దేవుడు హుండీలో ఎంత డబ్బులు వేయాలి ఎంత డబ్బులు వేస్తే ఇలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హుండీలో ఏడు రూపాయలు కనుక వేస్తే వారికి ఎలాంటి కష్టాలైనా సరే దూరం అవుతాయట. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు పండితులు. ఒకవేళ మీరు హుండీలో తొమ్మిది రూపాయలు కనుక వేస్తే మీకు ఎవరు నుంచి అయితే శత్రు భయం ఉంటుందో అది కాస్త తొలగిపోతుందని చెబుతున్నారు.. అదేవిధంగా శని గ్రహ దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. దేవుడి హుండీలో 11 రూపాయలు వేయవచ్చట.
ఇలా 11 రూపాయలు వేయడం వల్ల అప్పుల బాధల నుంచి కాకుండా మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు అని చెబుతున్నారు. మీరు హుండీలో 12 రూపాయలను వేయడం వల్ల కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా ఉంటారని ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి పరిష్కరించబడతాయని చెబుతున్నారు. హుండీలో 21 రూపాయలు కనుక వేస్తే దురదృష్టం తొలగిపోతుందట. దురదృష్టంతో బాధపడుతున్నాము అనుకున్నావు ఈ విధంగా హుండీలో 21 వేయడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం పట్టిపీస్తుందని చెబుతున్నారు పండితులు.