ధను సంక్రాంతి సమయంలో ఆ రాశిపై సూర్యుడి ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
- Author : Vamsi Chowdary Korata
Date : 15-12-2025 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
Dhanu Sankranti : ధను సంక్రాంతి అంటే సూర్యడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలో ప్రవేశించడం. దీనిని ధను సంక్రమణం అని కూడా అంటారు. ధనుస్సు రాశికి గురుడు అధిపతి. అధికారం, ఆత్మవిశ్వాసం వంటి వాటికి అధిపతి అయిన సూర్యుడు.. జ్ఞానం, ధర్మం వంటి వాటికి అధిపతి అయిన గురుడు ఇంట్లో ప్రవేశించడం వల్ల ఆధ్యాత్మికంగా విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ధను సంక్రమణం వేళ 12 రాశులపై సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుంది.. ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం చూద్దాం..
గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ప్రతి నెలా తన గమనాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఒక్కో నెల ఒక్కో రాశిలో ఉంటూ 12 నెలలు పన్నెండు రాశులలో సంచరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న సూర్యుడు డిసెంబర్ 16వ తేదీ మంగళవారం నుంచి ధనుస్సు రాశిలో ప్రవేశిచనున్నాడు. ఇలా సూర్యుడి గమనాన్ని ధను సంక్రమణం లేదా ధను సంక్రాంతి (Dhanu Sankranti 2025) అని అంటారు. ఈ ధను సంక్రమణం రోజు ప్రతి ఒక్కరూ సూర్యారాధన చేయాలి. ఇక ఈ ఏడాది తెలుగు పంచాంగం ప్రకారం ధను సంక్రాంతి రోజు పుణ్యకాలం చూస్తే.. డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 7.07 గంటల నుంచి మధ్యాహ్నం 1:23 గంటల మధ్యలో సూర్యుడి ధను సంక్రమణం (Sun Transit in Sagittarius) జరుగనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో ఉదయం 8:09 గంటల నుంచి 9:30 గంటల వరకు ఉన్న సమయాన్ని మహా పుణ్య కాలంగా చెబుతున్నారు. ఈ ధను సంక్రమణం సమయంలో చేసే స్నాన దాన జపాలకు విశేషమైన పుణ్య ఫలం లభిస్తుందనేది శాస్త్ర వచనం.
మేష రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం మేష రాశిపై ఎలా ఉంటుందంటే.. ఈ రాశి వారికి అదృష్టం, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి. తండ్రి, గురువు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఈరోజున వీళ్లు ఉదయం వేళ సూర్య నమస్కారం చేయడంతో పాటు బెల్లం దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
వృషభ రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం ఈ వృషభ రాశిపై ఎలా ఉంటుందంటే.. ఈ రాశి వారికి అనుకోని ధనం, పరిశోధనల్లో విజయం చేకూరుతాయి. కానీ ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా కంటి సమస్యలపై జాగ్రత్త అవసరం. ఈ రోజున ఈ రాశి వారు గోమాతకు బెల్లం తినిపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం ఈ మిథున రాశిపై ఎలా ఉంటుందంటే.. ఈ రాశి వారి వైవాహిక జీవితంలో లేదా వ్యాపార భాగస్వామ్యాల్లో ఒత్తిడి ఎదుర్కొంటారు. అహం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అహం పెరగకుండా చూసుకుంటూ.. సామరస్యం అలవరుచుకోవాలి. సూర్యుడికి ఆర్ఘ్యం, ఎర్రటి పువ్వులు సమర్పించడం శుభప్రదం.
కర్కాటక రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం ఈ కర్కాటక రాశిపై ఎలా ఉంటుందంటే.. వీళ్లు పోటీ పరీక్షలు, కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కానీ శత్రువులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తత అవసరం. ఈ రోజున వీళ్లు ఆదిత్య హృదయం పఠించడం, పేదలకు అన్నదానం చేయడం శుభప్రదం.
సింహ రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం ఈ సింహ రాశిపై ఎలా ఉంటుందంటే.. ఈ రాశి వాళ్లు సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. అయితే పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. వీళ్లు ఈ రోజున ఉదయం సూర్యోదయం వేళ గాయత్రీ పఠించడం శుభప్రదం.
కన్యా రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం ఈ కన్యా రాశిపై ఎలా ఉంటుందంటే.. ఈ రాశి వారికి ఆస్తి లేదా గృహ సంబంధిత విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. తల్లి ఆరోగ్యం లేదా కుటుంబ విషయాలపై దృష్టి పెట్టాలి. ఈ రోజున వీళ్లు రాగి పాత్రలో నీళ్లు, కుంకుమ కలిపి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి.
తుల రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం ఈ తుల రాశిపై ఎలా ఉంటుందంటే.. ఈ తుల రాశి వారికి కమ్యూనికేషన్ పెరుగుతుంది. దగ్గర ప్రయాణాలు లాభిస్తాయి. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడుతాయి. అయితే ధను సంక్రాంతి వేళ ఈ రాశి వారు సూర్య నమస్కారంతో పాటు ప్రవహించే నీటిలో గోధుమలు, బెల్లం వేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం ఈ వృశ్చిక రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే.. ఈ రాశి వాళ్లు ఆర్థిక స్థిరత్వం కోసం చేసే కృషి పెరుగుతుంది. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అయితే మాట విషయంలో అహం తగ్గించుకోవాలి. అలాగే ధను సంక్రాంతి రోజున బెల్లంతో చేసిన పదార్థాలు దానం చేయాలి.
ధనుస్సు రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం ఈ ధనుస్సు రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే.. ఈ రాశి వారికి వ్యక్తిత్వం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కానీ ఇతరులపై అహంకారం, ఆధిపత్యం చూపడం తగ్గించాలి. అయితే గురువులు, పెద్దలను గౌరవించాలి. పసుపు వస్త్రాలు, బెల్లం దానం చేయడం శుభప్రదం.
మకర రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం ఈ మకర రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే.. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత ప్రయాణాల్లో విజయం వరిస్తుంది. అలాగే ఖర్చులు పెరుగుతాయి. నిద్రలేమి సమస్యలపై దృష్టి పెట్టాలి. అలాగే ఈ రాశి వారికి నిరుపేదలకు, వృద్ధులకు దుప్పుట్లు దానం చేయడం శుభప్రదం.
కుంభ రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం ఈ కుంభ రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే.. ఈ కుంభ రాశి వారికి ఆర్థికంగా లాభాలు, కోరికలు నెరవేరుతాయి. స్నేహితులు, సామాజిక వర్గంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారిని ఆదివారం రోజున ఉపవాసం పాటించడం, ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల శుభప్రదం.
మీన రాశి
ధను సంక్రాంతి వేళ సూర్యుడి ప్రభావం ఈ మీన రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే.. ఈ మీన రాశి వారికి పదోన్నతి లభించడం, గౌరవం పెరగడం వంటివి కలుగుతాయట. పై అధికారుల నుంచి సహకారం అందుతుంది. చేసే పనిలో గుర్తింపు లభిస్తుంది. అయితే ఈ రాశి వారు ప్రతి రోజూ ఉదయం వేళ సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించి సూర్య దేవుడి మంత్రాలను జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.