Lalbaugcha Raja Ganesh 2024 : అత్యంత సంపన్న ‘గణనాథుడు’ సిద్ధం
Lalbaugcha Raja Ganesh : ముంబైలోని GSB సేవా మండల్ ఏర్పాటు చేసే గణపతిని 66 కిలోల బంగారు ఆభరణాలతో పాటు 325కిలోల వెండి, ఇతర విలువైన వస్తువులతో సిద్దమయ్యాడు
- By Sudheer Published Date - 02:43 PM, Fri - 6 September 24

GSB Seva Mandal’s Ganesh Idol Out.. 66 Kg Gold, 336 Kg Silver Ornaments Major Highlights : దేశవ్యాప్తంగా కుల మతాలతో సంబంధం లేకుండా..చిన్న నుంచి పెద్ద వరకు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వినాయక చవితి (Ganesh Chaturthi) రానేవచ్చింది. గల్లీ గల్లీ లో వినాయక మండపాలు సిద్ధం అయ్యాయి. వారం రోజుల ముందు నుండి వినాయక చవితి కోలాహలం మొదలైంది. గ్రామాల దగ్గర నుంచి పట్టణ నగరాల వరకు ఈ గణపతి నవరాత్రలను (Ganesh Navaratri Celebrations) ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ వస్తున్నారు. వినాయక చవితిని ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున జరుపుకుంటారు.
ఈ పర్వదినంనాడు విఘ్నేశ్వరుడి జన్మదినం కావున అన్ని విఘ్నాలకు తొలగించే మహా గణపతిని ఆ రోజు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం చవితి తిథి సెప్టెంబర్ 6 తేదీన అలాగే సెప్టెంబర్ 7వ తేదీన.. రెండు రోజుల పాటు ఉందని జ్యోతిష్యులు చెపుతున్నారు. రేపు ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్యలో ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూజ చేసుకోలేని వారు సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత కల్పం చేసుకోవచ్చని చెపుతున్నారు.
66 కిలోల బంగారు ఆభరణాలతో సిద్దమైన లాల్‌బాగ్చా రాజా గణేష్
ఇక చవితి రోజు పూజలందుకునేందుకు ఇండియాలో అత్యంత సంపన్నుడైన గణనాథుడు సిద్ధమయ్యాడు. ముంబై (Mumbai )లోని GSB సేవా మండల్ (Lalbaugcha Raja Sarvjanik Ganeshotsav Mandal) ఏర్పాటు చేసే గణపతిని 66 కిలోల బంగారు ఆభరణాలతో పాటు 325కిలోల వెండి, ఇతర విలువైన వస్తువులతో అలంకరిస్తారు. రేపటి నుంచి 11వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం నిర్వాహకులు రూ.400.58 కోట్ల బీమా కవరేజీ తీసుకున్నారు. కాగా, ‘Lalbaugcha Raja’ గణపతికి 20 కిలోల బంగారు కిరీటాన్ని అనంత్ అంబానీ విరాళంగా ఇచ్చారు.
లాల్‌బాగ్చా రాజా గణేష్ వచ్చిన కానుకలను వేలం
ముంబయిలోని లాల్‌బాగ్చా రాజా గణేష్ (Lalbaugcha Raja Ganesh)కు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. గత 94 ఏళ్లుగా దక్షిణ ముంబైలోని లాల్‌బాగ్ మార్కెట్‌లో కొలువు దీరుతున్న ఈ గణేషుడి ఉత్సవాలు దేశంలోనే ప్రఖ్యాతిగాంచింది. లాల్‌బాగ్చా రాజాను ప్రతి ఏటా లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. వీళ్లలో వీఐపీలు కూడా ఉంటారు. అంతేకాదు కోట్ల కొద్దీ విరాళాలు, కేజీల కొద్దీ బంగారం, వెండీ కూడా వస్తాయి. విరాళంగా వచ్చిన కానుకలను వేలం వేయడం, విరాళాలు, వేలం ద్వారా వచ్చిన డబ్బును సామాజిక సేవ కోసం ఉపయోగిస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాగే చేయనున్నారు.
Read Also : Budameru : బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించిన పురందేశ్వరి