Business: వ్యాపారం సరిగా జరగడం లేదా.. అయితే ఇలా చేయండి.. ఇక లాభాలే లాభాలు!
వ్యాపారం సరిగా జరగడం లేదని బాధపడుతున్న వారు కొన్ని రకాల పనులు చేయాలని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:33 AM, Fri - 22 November 24

మామూలుగా వ్యాపారాన్ని గాలివాటం అని అంటూ ఉంటారు. అంటే కొన్ని కొన్ని సార్లు బాగా జరగవచ్చు కొన్నిసార్లు పూర్తిగా డల్ కావచ్చు. కొంతమందికి వ్యాపారమే సరిగ్గా జరగక, బిజినెస్ లని ఎత్తేస్తూ ఉంటారు. ఆశించిన లాభాలు లేక పెట్టుబడి పెట్టిన దానికి డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా పురోగతి సాధించలేకపోతారు. అలాంటప్పుడు కొన్ని చిట్కా ఫాలో అయితే చాలు వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుందని చెబుతారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. కొంతమంది ఎంత కష్టపడినా వ్యాపారంలో లాభాలు రాకపోగా ఏ పని చేపట్టినా ఆటంకాలు ఏర్పడతాయి.
వ్యాపారంలో పుంజుకునేందుకు రాత్రి పగలు కష్టపడతూ ఉంటారు. కానీ చాలాసార్లు విజయాన్ని సాధించలేకపోతారు. వ్యాపారం ఊపందుకోకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ఒకటి వాస్తు లోపం. ఇది మీ కస్టమర్ లను మీ ఉత్పత్తి వైపు ఆకర్షిస్తుందట. అలాగే మీకు లాభాలను తెస్తుందట. వ్యాపార సముదాయంలో పాటించాల్సిన కొన్ని వాస్తు నియమాలు ఇవి. వీటిని సరిగా పాటిస్తే వ్యాపారంలో దూసుకెళ్తారట. మీ రిటైల్ దుకాణం ప్రవేశ దిశ చాలా ముఖ్యమైనది. దీని ద్వారా మాత్రమే సానుకూల శక్తి ప్రవహిస్తుందట. ఉత్తరం లేదా తూర్పు వైపు ప్రవేశాన్ని ఉంచడం అన్నది శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది శ్రేయస్సు, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుందట. ప్రధాన ద్వారం ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. బాగా వెలుతురు ఉండాలి.
అలాగే చాలా అందంగా, ఆకర్షణీయంగా కూడా ఉండే విధంగా చూసుకోవాలి. షాపుకు వెళ్ళగానే ముందు గది మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఉదయం దుకాణంలో శంఖం ఊదండి లేదా మొబైల్ లో శంఖం ధ్వనిని వినండి. దుకాణానికి ఉత్తరం వైపున మట్టి కుండలో కొన్ని ఖర్జూరాలు ఉంచాలి. షాప్ కౌంటర్ లో ఫెంగ్ షూయి పిల్లిని ఉంచండి. అది నిరంతరం చేతులు ఊపుతూ ఉంటుంది. దుకాణానికి ఈశాన్య దిశలో ఉంచిన ఇనుప తాళాలు పెడుతున్నట్టయితే వెంటనే వాటిని తొలగించడం మంచిది. దుకాణం ఆగ్నేయ దిశలో ఎరుపు రంగు కుండీలను ఉంచాలి. షాపులో ఉంచిన వస్తువులను ఇక్కడి నుంచి అక్కడికి మార్చుకోవాలని చెబుతున్నారు. కుర్చీ కింద మీ కుషన్ పై పసుపు గుడ్డను పరచి, రావి ఆకులను ఉంచాలి. అవి ఎండిపోయినప్పుడు వాటిని మార్చుకుంటూ ఉండాలి. ఇలా వాస్తులో నగదు ఉంచడం కూడా ఒక ముఖ్యమైన దిశ.
వాస్తు ప్రకారం ఉత్తర, ఈశాన్య, ఆగ్నేయంలో క్యాష్ కౌంటర్ ఉంచుకోవాలి. ఈ దిశ డబ్బు, సంపదను ఆకర్షిస్తాయి. ఈ స్థలంలో నగదు ఉంచడం వల్ల మీ జీవితంలో సంపద పెరుగుతుందని చెబుతున్నారు. వ్యాపారం ముందుకు తీసుకెళ్లడం కోసం ఉత్తర దిశలో నీలం రంగు తామర చిత్రాన్ని ఉంచుకోవచ్చట. లేదంటే తెలుపు రంగు పిగ్గీ బ్యాంకును ఉంచుకుని అందులో రోజు కొంచెం డబ్బులు వేసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఈశాన్య దిశలో కుంకుమతో స్వస్తిక్ చిహ్నం వేసుకోవాలి. వ్యాపారంలో పురోగతి సాధించడం కోసం ఆహారంలో మిరియాలు, పుల్లని వస్తువులు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది ఈ విధమైన చిట్కాలను పాటించి మీ వ్యాపారంలో అభివృద్ధిని చూసుకోండి.