Ash Gourd: దిష్టి నివారణ కోసం గుమ్మడికాయ కడుతున్నారా.. అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గుమ్మడికాయ దిష్టి నివారణ కోసం ఉపయోగించేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:07 PM, Sat - 15 February 25

మామూలుగా గుమ్మడికాయలు రెండు రకాలు. అందులో ఒకటి మామూలుగా కూరల కోసం ఉపయోగించేది అయితే మరొకటి బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయను దిష్టి తీయడం, నివారణ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చాలామంది తెలిసి తెలియక ఈ బూడిద గుమ్మడికాయ ఇంటికి కట్టే ముందు చిన్నచిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. వాటి వల్ల గుమ్మడికాయ కట్టిన కూడా ఎలాంటి ఫలితం ఉండదని చెబుతున్నారు. అయితే మరి గుమ్మడికాయ కట్టే ముందు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టాలి అనుకున్న వారు మొదటి దానిని శుభ్రం చేయడం లాంటివి చేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదట. బూడిద గుమ్మడికాయను ఎట్టి పరిస్థితుల్లో నీటితో శుభ్రం చేయకూడదని చెబుతున్నారు. ఈ విధంగా నీటితో శుభ్రం చేయడం వల్ల దాని శక్తి తగ్గిపోతుందట. కాబట్టి గుమ్మడికాయకు పసుపు కుంకుమ బొట్లు పెట్టితే సరిపోతుంది అని చెబుతున్నారు. అలాగే తొడిమ ఉన్న గుమ్మడికాయని మాత్రమే ఇంటికి దిష్టి నివారణ కోసం కట్టాలి. తొడిమ లేకుండా కడితే ఎలాంటి ఫలితం ఉండదట. అలాగే మార్కెట్ నుంచి ఇంటికి గుమ్మడికాయ తెచ్చేముందు తొడిమ కిందికి ఉండే విధంగా పట్టుకొని రాకూడదట. కాడ పైకి ఉండేలా పట్టుకుంటేనే దాని శక్తి నిలుస్తుందని చెబుతున్నారు. ఇకపోతే గుమ్మడికాయని కట్టడానికి సరైన సమయం ఏంటి అన్న విషయానికి వస్తే..
అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే గుమ్మడికాయ కడితే మంచిదట. ఇలా చేస్తే అది దిష్టిని తొలగించి శుభ ఫలితాలను అందిస్తుందట. అమావాస్య రోజు కుదరకపోతే బుధవారం రోజు శనివారం రోజు సూర్యోదయానికి ముందే కట్టవచ్చట. సూర్యోదయానికి ముందే కడితే మంచి ఫలితాలు కనిపిస్తాయట. సూర్యాస్తమయం తరువాత కడితే ఎలాంటి ఫలితాలు ఉండవని. అయితే గుమ్మడికాయ ఇంటికి కట్టాలి అనుకున్న వారు ముందుగా గుమ్మడికాయని ఒక ప్లేట్ లోకి తీసుకొని దానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టాలి. ఆ తర్వాత పూజ చేసి దానిని ఇంటి ముందు వేలాడదీయాలట. పండితుల చేత గుమ్మడికాయ తో పూజ చేయించుకుని కడితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ నియమాలను పాటించి సరైన సమయంలో గుమ్మడికాయ కట్టడం వల్ల దిష్టి ప్రభావం నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.