Holy Festival: సెప్టెంబరు 1 నుంచి తాళ్లపాక చెన్నకేశవస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు
తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు ఘనంగా పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 31 సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహిస్తారు.
- By Hashtag U Published Date - 04:58 PM, Sun - 28 August 22

తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు ఘనంగా పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 31 సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహిస్తారు.
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 1న చతుష్టానార్చన,బింబారాధన, మండలారాధన, కుంబారాధన, కుండలారాధన, పవిత్రహవనం, పవిత్రహోమం, శాత్తుమొర నిర్వహిస్తారు. సెప్టెంబరు 2న పవిత్ర సమర్పణ, నిత్య హోమాలు, సెప్టెంబరు 3న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి-అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరగనున్నాయి.