Eyeballs Offering : ఆ దేవతకు కనుబొమ్మలనూ మొక్కుగా సమర్పిస్తారు
ఇక్కడి ఆదివాసీలు ‘ఏత్మాసూర్’ అనే దేవతను(Eyeballs Offering) ఆరాధిస్తుంటారు.
- By Pasha Published Date - 01:41 PM, Sat - 26 October 24

Eyeballs Offering : దేవతల మొక్కు తీర్చుకునే క్రమంలో తలనీలాలను సమర్పించడం గురించి మనకు తెలుసు. అయితే భక్తులు ఒక దేవతకు మాత్రం కనుబొమ్మలను కూడా మొక్కుగా సమర్పిస్తుంటారు. ఇంతకీ ఈ సంప్రదాయం ఎక్కడుంది ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Wikipedia Vs Elon Musk : వికీపీడియాది వామపక్ష భావజాలం.. విరాళాలు ఇవ్వొద్దు : ఎలాన్ మస్క్
తలనీలాలతో పాటు కనుబొమ్మలను మొక్కుగా సమర్పించే సంప్రదాయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మారుతిగూడ గ్రామంలో ఉంది. ఇక్కడి ఆదివాసీలు ‘ఏత్మాసూర్’ అనే దేవతను(Eyeballs Offering) ఆరాధిస్తుంటారు. ఈ దేవతకు మొక్కులు చెల్లించే క్రమంలో పిల్లల నుంచి పెద్దల దాకా కనుబొమ్మలు, తలనీలాలను సమర్పిస్తుంటారు. చాలా ఏళ్లుగా ఈ ఆచారాన్ని ఇక్కడి ఆదివాసీలు పాటిస్తున్నారు. ఏత్మాసూర్ దేవతను తాము కోరుకున్న కోరికలు నెరవేరితే ఈవిధంగా తలనీలాలతో పాటు కనుబొమ్మలను అర్పిస్తారు. ఈ మొక్కును తీర్చే క్రమంలో తలనీలాలు, కనుబొమ్మల వెంట్రుకలను ఇంటి ఆడపడుచులు లేదా మేనత్తలు కొంగు చాచి పట్టుకుంటారు. అంతకంటే ముందు వారు నువ్వులు, బెల్లం, కుడుకలు తీసుకొచ్చి ఏత్మాసూర్ దేవతకు పూజలు చేస్తారు.
Also Read :Lawrence Bishnoi : జైలులో నుంచి లారెన్స్ బిష్ణోయి ఇంటర్వ్యూలు.. ఏడుగురు పోలీసులు సస్పెండ్
గుస్సాడి సందడి
ఆదివాసీల ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడి(దండారి) ఉత్సవాలు ఉట్నూరు ఏజెన్సీలో ఇటీవలే ప్రారంభమయ్యాయి. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ఆదివాసులు ప్రాణపదంగా భావిస్తారు. ఆదివాసీలకు పెద్ద పండుగ దండారి. ఈ పండుగను గిరిజన గూడాలలో ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి కంటే ముందు భోగితో దండారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. దీపావళి తర్వాత కోల బోడితో ఈ వేడుకలు ముగుస్తాయి.దండారి ఉత్సవాల సందర్భంగా గుస్సాడీలు ఒకే దగ్గర ఉంటారు. స్నానాలు కూడా చేయరు. నృత్యం చేసే వారు శరీరం నిండా బూడిద పూసుకుంటారు. ముఖానికి మసి రాసుకుంటారు. ప్రత్యేకమైన పేర్ల దండలు ధరిస్తారు. మెడలో రుద్రాక్షలు, అడవుల్లో దొరికే ఇతర రకాల కాయలు, గవ్వలతో దండలు మెడలో వేసుకుంటారు. కుడి చేతిలో మంత్రదండం పట్టుకుంటారు. గుస్సాడీ నృత్యం చేసే వారిని దేవతలు ఆవహిస్తారని, వారి చేతిలోని మంత్రదండంతో శరీరాన్ని తాకితే ఎలాంటి వ్యాదులైనా నయమవుతాయని గోండుల నమ్మకం.