Ayyappa : అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన రాష్ట్రపతి
Ayyappa : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేరళలోని ప్రసిద్ధ శబరిమల శ్రీ అయ్యప్పస్వామిని దర్శించుకుని చరిత్ర సృష్టించారు. 67 ఏళ్ల వయస్సులో ఆమె భక్తిశ్రద్ధలతో ఇరుముడిని తలపై పెట్టుకుని
- By Sudheer Published Date - 07:31 PM, Wed - 22 October 25

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేరళలోని ప్రసిద్ధ శబరిమల శ్రీ అయ్యప్పస్వామిని దర్శించుకుని చరిత్ర సృష్టించారు. 67 ఏళ్ల వయస్సులో ఆమె భక్తిశ్రద్ధలతో ఇరుముడిని తలపై పెట్టుకుని పవిత్ర 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించడం విశేషంగా నిలిచింది. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ రాష్ట్రపతి హోదాలో శబరిమల ఆలయాన్ని ఇరుముడితో దర్శించుకోలేదు. ఈ సందర్భంలో ఆలయ అధికారులు రాష్ట్రపతికి ప్రత్యేక సత్కారం అందజేశారు. ఆలయ ఆచార నియమాలను పూర్తిగా పాటిస్తూ, ఇరుముడి కట్టుతో చేసిన ఈ యాత్రను ఆమె తన భక్తి, వినయానికి ప్రతీకగా మలిచారు.
Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!
రాష్ట్రపతి ముర్ము ఈ యాత్రలో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేకుండా, భక్తునిగా స్వామివారిని దర్శించుకోవడం భక్తజనుల్లో విశేషంగా మారింది. ఆమె 41 రోజుల మాండల దీక్షా నియమాలను గౌరవిస్తూ, సంప్రదాయ పద్ధతిలోనే ఇరుముడి సమర్పించారు. ఇది శబరిమల ఆలయ పద్దతులకు, ఆచారాలకు గౌరవ సూచకంగా నిలిచింది. ఈ సందర్భంలో రాష్ట్రపతి అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థించినట్లు సమాచారం.
కేంద్రమంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్మును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. “ఆమె 67 ఏళ్ల వయస్సులో ఉన్నా కూడా ఒక్క నియమాన్నీ ఉల్లంఘించలేదు, ఎవరి విశ్వాసాన్ని తక్కువ చేయలేదు. సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తితో అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఇది అందరికీ ఆదర్శం” అని ఆయన పేర్కొన్నారు. ఈ దర్శనం దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. మహిళలు, ముఖ్యంగా ఉన్నత పదవిలో ఉన్నవారు సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ భక్తి మార్గంలో ముందుకు సాగితే అది సమాజానికి ప్రేరణగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.