Dhanteras : ధంతేరాస్ రోజున మర్చిపోయి కూడా ఈ వస్తువులు కొనకండి..కొంటే శనిని ఆహ్వానించినట్లే..!!
దీపావళి వేడుకల్లో మొదటిరోజు ధన్‌తేరస్ జరుపుకుంటారు. ధంతేరాస్ ను ప్రధాన పండుగగా పరిగణిస్తారు. శ్రేయస్సు, సంపద కోసం ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు.
- By hashtagu Published Date - 05:57 AM, Mon - 17 October 22

దీపావళి వేడుకల్లో మొదటిరోజు ధన్‌తేరస్ జరుపుకుంటారు. ధంతేరాస్ ను ప్రధాన పండుగగా పరిగణిస్తారు. శ్రేయస్సు, సంపద కోసం ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 23న ధంతేరాస్ ను జరుపుకోనున్నారు. అయితే ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన వస్తువులతోపాటు, బంగారం, వెండి మొదలైవాటిని కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేస్తే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతుంటారు.
అయితే ధంతేరాస్ రోజున కొన్ని వస్తువులు కొనకూడదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి వస్తువులు కొనుగోలు చేస్తు మీ ఇంట్లో ధన నష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి కలత చెందుతుంది. అయితే ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయకూడదో తెలుసుకుందాం.
ఇనుము
ధన్‌తేరస్ రోజున లోహాన్ని కొనుగోలు చేయడం శుభప్రదమని నమ్ముతారు. బంగారం, వెండికి బదులుగా మీరు ఇనుముతో తయారు చేసిన వస్తువును కొనుగోలు చేయకండి. ఎందుకంటే అది మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సుకు బదులుగా పేదరికాన్ని కలిగిస్తుంది. శనివారం ఇనుముతో తయారు చేసిన వస్తువులను అస్సులు కొనకూడదు. ఎందుకంటే శనీశ్వరుడిని ఇంటికి ఆహ్వానించినట్లే.
ప్లాస్టిక్ వస్తువులు
మీరు ధంతేరస్ రోజున షాపింగ్ చేస్తుంటే..ప్లాస్టిక్ పాత్రలను కొనకండి..ధంతేరస్ రోజున కొన్ని లోహాలను కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే ఈ రోజున ఏది కొనుగోలు చేసినా అది లక్ష్మీ పూజలో ఉపయోగించబడుతుంది. మీరు ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేస్తే…దానిపై లక్ష్మీదేవికి ఏదైనా సమర్పించడం.. పూజలో ఉపయోగించకూడదు.
కృత్రిమ ఆభరణాలు
ధంతేరస్ రోజున బంగారం, వెండి లేదా వజ్రాల ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కానీ మీరు ఈ రోజున కృత్రిమ ఆభరణాలను కొనుగోలు చేయకండి. ఇలా చేస్తే మీ జీవితంలో సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ధంతేరాస్ రోజు కొనుగోలు చేసిన వస్తువులను పూజ సమయంలో లక్ష్మీదేవికి సమర్పించడం ఆచారం. అప్పుడే ఆ వస్తువులు ఉపయోగంలోకి వస్తాయి. అమ్మవారికి కృత్రిమ ఆభరణాలు సమర్పిస్తే ఇంట్లో దరిద్రం వస్తుంది.
కారు లేదా ఇల్లు
ధంతేరస్ రోజున మీరు బంగారం, వెండి లేదా పాత్రలు వంటి ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే.. జీవితంలో శ్రేయస్సును సృష్టిస్తుందని నమ్ముతారు. కానీ ఈ రోజున కారు, ఇల్లు లేదా దుకాణం వంటి పెద్ద కొనుగోలుకు దూరంగా ఉండాలి. వీటిలో దేనినైనా కొనుగోలు చేయాలనుకుంటే, ఒక రోజు ముందుగానే డబ్బు చెల్లించండి.
పదునైన సాధనాలు
సాధారణంగా ధన్తేరస్ రోజున పాత్రలు లేదా ఏదైనా వంటగది వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజున చాలా మంది మహిళలు షాపింగ్ వెళ్లినపుడు శ కత్తులు కత్తెర వంటి కొన్ని వంటగదికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజు ఎటువంటి పదునైన వస్తువులు లేదా పనిముట్లు కొనకండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో గొడవలు పెరగడంతోపాటు లక్ష్మీదేవికి కోపం వస్తుంది.