Green India Challenge: గణేశ్ నిమజ్జనంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. జూట్ బ్యాగ్స్ పంపిణీ
చొప్పదండి CI రవీందర్ ప్లాస్టిక్ వాడకాలను నియంత్రించే దిశగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
- Author : Balu J
Date : 28-09-2023 - 12:17 IST
Published By : Hashtagu Telugu Desk
ప్లాస్టిక్ ని నియంత్రిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం. గణపతి నిమజ్జనం లో భాగంగా కరీంనగర్ లోని చింతకుంట చెరువు వద్ద ప్లాస్టిక్ నియంత్రణ లో భాగంగా చొప్పదండి CI రవీందర్ ఆధ్వర్యంలో జూట్ బ్యాగ్స్ పంపిణి చేశారు. కరీంనగర్ చింతకుంట చెరువు వద్ద రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు చొప్పదండి CI రవీందర్ ప్లాస్టిక్ వాడకాలను నియంత్రించే దిశగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ప్లాస్టిక్ కి బదులు అందరు జూట్ బ్యాగ్స్ లేదా పేపర్ బ్యాగ్స్ వాడాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జూట్ బ్యాగ్స్ మరియు పేపర్ బ్యాగ్స్ ని పంచి అందరిలో ఒక అవగాహనని కల్పించే దిశగా పని చేస్తున్నారు అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవలసిన భాద్యత మన మీద ఎంతయినా ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమం కానీ ప్లాస్టిక్ ని నియంత్రించే విధంగా చేపట్టే కార్యక్రమాలు రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరం అన్నారు.
Also Read: Harish Rao: అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో: మంత్రి హరీశ్ రావు