Laughing Buddha : లాఫింగ్ బుద్ధ మీ ఇంట్లో కూడా ఉందా? అయితే మీ దశ తిరిగినట్టే..
లాఫింగ్ బుద్ధను (Laughing Buddha) ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుంది. మార్కెట్‌లో వివిధ రకాల లాఫింగ్ బుద్ధ విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి.
- Author : Naresh Kumar
Date : 11-12-2023 - 6:40 IST
Published By : Hashtagu Telugu Desk
Laughing Buddha : వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా లేదా కుటుంబంలో ఎవరైనా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా లాఫింగ్ బుద్ధను (Laughing Buddha) ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుంది. మార్కెట్‌లో వివిధ రకాల లాఫింగ్ బుద్ధ విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చేతిలో డబ్బుతో ఉన్న లాఫింగ్ బుద్ధుని విగ్రహం కొనుగోలు చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు.
We’re Now on WhatsApp. Click to Join.
లాఫింగ్ బుద్ధను (Laughing Buddha) ఇంట్లో పెట్టుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతుంది. అంతేకాదు ఈ విగ్రహం అదృష్టం కూడా తెస్తుందని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. కాగా ఇంట్లో లాఫింగ్ బుద్దను ఇంట్లో పెట్టడం వలన చాలా మంచిది. దీనివల్ల ఆర్థిక సమస్యలను తొలగిపోతాయి. అదృష్టం కూడా వస్తుంది. అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ముఖద్వారానికి ఎదురుగా అస్సలు పెట్టకూడదు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మొదటగా ఆ విగ్రహం కనిపించేలా పెడితే మంచిది. దీనివల్ల ఆర్థిక సమస్యలు దూరమవ్వడమే కాకుండా మీ ఐశ్వర్యం కూడా పెరుగుతుంది.
అంతేకాకుండా మీకు రావాల్సిన బాకీలు, ధనం కూడా తొందరగా వస్తాయి. మీకు ఏవైనా అప్పులు ఉంటే అవి తీరతాయి. ఇక దుకాణాలు లేదా షాపింగ్ మాల్స్‌లో ఈ విగ్రహాన్ని ఉంచుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా షాప్ ప్రధాన ద్వారం వద్ద ఈ లాఫింగ్ బుద్ధాను పెట్టడం వలన వ్యాపారం పెరుగుతుంది, లాభాలు కూడా బాగా వస్తాయి. నరదృష్టి పోతుంది. మంచి ప్రశాంతత లభిస్తుంది. ఇక తాబేలు పై కూర్చున్న లాఫింగ్ బుద్ధుడిని శక్తికి సంకేతంగా భావిస్తారు. ఇటువంటి బొమ్మ మీ ఇంట్లో ఉంటే మీకు పంపద పెరుగడానికి ఇది దోహదపడుతుంది. ఈ లాఫింగ్ బుద్ధని ఎక్కడ పెట్టకూడదు అన్న విషయానికి వస్తే.. లాఫింగ్ బుద్ధుడి విగ్రహాన్ని ముఖ్యంగా వంటగదిలో లేదా బాత్రూంలలో పెట్టకూడదు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ ప్రదేశాల్లో లాఫింగ్ బుద్ధని పెట్టడం అరిష్టంగా పరిగణిస్తారు. ఇంటి నేలపై ఎప్పుడూ కూడా లాఫింగ్ బుద్ధుడి విగ్రహాన్ని ఉంచకూడదు.
Also Read: Sabarimala Temple: శబరిలో విషాదం.. క్యూ లైన్‌లో కుప్పకూలిన బాలిక చికిత్స పొందుతూ మృతి