Thursday: డబ్బు కొరతతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే గురువారం రోజు ఇలా చేయాల్సిందే!
డబ్బుకు సంబంధించిన సమస్యలతో డబ్బు కొరతతో ఇబ్బంది పడుతున్న వారు గురువారం రోజు తప్పకుండా కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు..
- By Anshu Published Date - 01:00 PM, Wed - 12 March 25

వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడుని పూజిస్తూ ఉంటాను అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయా రోజుల్లో ఆ దేవులను ప్రత్యేకంగా పూజించడంతోపాటు వారికి ఇష్టమైన నైవేద్యాలను పువ్వులను వంటివి సమర్పిస్తూ ఉంటారు. ఇక వారంలో గురువారం రోజు విష్ణుమూర్తిని సాయిబాబాను, దత్తాత్రేయను పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా గురువారం రోజు విష్ణుమూర్తిని పూజించడంతోపాటు ఉపవాసం ఉండడం వల్ల భక్తులు కోరిన కోరికలు తొందరగా నెరవేరుతాయని నమ్మకం. సాధారణంగా గురవారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు.
ఇక జ్యోతిషశాస్త్రంలో గురువారం బృహస్పతితో ముడిపడి ఉంటుంది. ఈ రోజున చేసే పూజ జాతకంలో గురువు స్థానాన్ని బలపరుస్తుందట. దీని కారణంగా వివాహ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయని చెబుతున్నారు. అయితే ఇంతకీ గురువారం రోజు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. గురువారం రోజున ఎక్కువగా పసుపు రంగు వస్తువులను ఉపయోగించాలట. ఈ విధంగా చేయడం వల్ల వివాహంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయట.
అలాగే గురువారం రోజు ఒక ముద్ద పిండిలో పప్పు, బెల్లం, పసుపు కలిపి ఆవుకి తినిపించాలట. ఈ విధంగా చేస్తే సంపద పెరుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా గురువారం రోజు విష్ణువు లక్ష్మీదేవిని ఇద్దరిని కలిపి పూజించాలట. పూజ సమయంలో శక్తివంతమైన మంత్రాలను జపించాలని, దీనివల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ రోజున పసుపు వస్తువులను దానం చేస్తే విష్ణువు సంతోషిస్తాడట. దీని ప్రభావం వల్ల భక్తుడి అన్ని దుఃఖాలు తొలగిపోతాయట.
అలాగే గురువారం నాడు విష్ణువును పూజించాలట. పూజ తర్వాత, మణికట్టుపై పసుపు తిలకం వేయాలట. దీనివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు. గురువారం రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి ఆ తర్వాత ఓం బృహస్పతే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి, ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతాయట. గురువారం ఉదయం, సాయంత్రం విష్ణువును పూజించాలట. పూజ చివరిలో విష్ణువుకు హారతి ఇవ్వాలని, ఆ సమయంలో హారతి శ్లోకాలను భక్తితో, తమ సమస్యలు తొలగించమని ఆర్తితో ఆలపిస్తూ హారతి ఇవ్వాలని చెబుతున్నారు. ఈ విదంగా చేస్తే విష్ణువు అనుగ్రహిస్తాడట.