Shiva Puja Tips: శివయ్య పూజలో పొరపాటున కూడా వీటిని అస్సలు ఉపయోగించకండి.. అవేంటంటే!
పరమేశ్వరికి పూజ చేసేటప్పుడు కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని ముఖ్యంగా పూజలో కొన్ని కొన్నింటిని అసలు ఉపయోగించకూడదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:03 AM, Wed - 25 December 24

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. పరమేశ్వరున్ని ఒక్కొక్క ప్రదేశంలో ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. భక్తిశ్రద్ధలతో నిర్మలమైన మనసుతో పరమేశ్వరున్ని పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భక్తుల నమ్మకం. పరమేశ్వరుడికి పూజ చేయడం మంచిదే కానీ పొరపాటున కూడా శివయ్య పూజలు కొన్ని తప్పులు చేయకూడదట. తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల శని దోషం ఏర్పడుతుందని చెబుతున్నారు. మరి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన విభూదిని నుదుటిన మూడు గీతలు అడ్డంగా ధరించాలి. ఈ విధంగా ధరించడం వల్ల పాపాలు నశిస్తాయని నమ్మకం.
శివయ్య పూజలో భస్మాన్ని ఉపయోగించాలి. పొరపాటున కూడా శివయ్య పూజలో కుంకుమను అసలు ఉపయోగించకూడదు. అంతేకాకుండా శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. కేవలం విభూది గంధంతో మాత్రమే పరమేశ్వరుడిని అలంకరించాలి. అభిషేకంలో జలం చెరుకు రసం ద్రాక్ష రసం వంటివి మాత్రమే ఉపయోగించాలి. కొబ్బిరి నీళ్ళను మాత్రం శివలింగానికి అర్పించరాదు. శివాలయం చుట్టూ చేసే ప్రదక్షిణ విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మిగతా ఆలయాల్లో చేసే విధంగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. శివలింగానికి అభిషేకం ఆవు పాలతో చేయాలి. ముఖ్యంగా సోమవారం శివుడికి ఆవు పాలతో అబిషేకం చేయడం అత్యంత ఫలవంతం అని నమ్మకం. అయితే కొంతమంది పేకెట్ పాలతో అభిషేకం నిర్వహిస్తారు.
ఇలా చేయడం మంచిది కాదు. పాలను ఒక గ్లాస్ లోకి తీసుకుని అనంతరం అభిషేకం చేయాలి. సోమవారం రోజున కైలాసం నుంచి భూమి మీదకు శివుడు వస్తాడని నమ్మకం. కనుక ఈ రోజు పూజ చేయడం ఇంట్లో లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం అత్యంత ఫలవంతం అని చెబుతున్నారు. అలాగే పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు రాగి లేదా స్టీలు పాత్రలు ఉపయోగించకూడదట. శివలింగానికి పాలతో అభిషేకం నిర్వహించిన తరువాత నీరుతో అభిషేకం చేయాలని చెబుతున్నారు. అభిషేకం చేసే సమయంలో మన శరీరంపై ఉన్న చెమట లేదంటే వెంట్రుకలు పొరపాటున కూడా శివయ్య మీద పడకూడదు. మీరు ఇంట్లో శివలింగం పెట్టుకోవాలి అనుకుంటే నిత్యం జలధార ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. శివున్ని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. నంది వర్ధనం పూలతో పూజ చేస్తే జీవితంలో సుఖ శాంతులు లభిస్తాయి. అదే విధంగా పారిజాత పూలతో శివుడికి పూజ చేస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివుడికి ఎరుపు రంగు పూలతో పూజ చేయకూడదు. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది.