Diwali: దీపావళి రోజు వెలిగించే దీపాలకు కూడా ఒక పద్ధతి ఉంటుందని మీకు తెలుసా?
Diwali: దీపావళి రోజున వెలిగించే దీపాలను కూడా ఒక పద్ధతి నియమాలను అనుసరించి వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:25 PM, Wed - 15 October 25

Diwali: దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దీపావళి అంటేనే దీపాల పండుగ. అయితే ఈ దీపాలను వెలిగించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని మీకు తెలుసా? దీపావళి రోజున వెలిగించే దీపాల విషయంలో కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీ గణేశడుని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఈ లక్ష్మీ గణేశుడు ముందు వెలిగించే దీపాలను కూడా నేలపై ఉంచకూడదట.
ఏదైనా ఆసనం లేదంటే ఆకు లేదంటే అక్షతలు ఉంచి దీపం వెలిగించాలని చెబుతున్నారు. అలాగే దీపాన్ని ఒక పవిత్ర రూపంగా భావించి పూజిస్తారు. అలాంటి దీపంలో నూనెను నిండుగా వేయడం సరైనది కాదని చెబుతున్నారు. దీని వల్ల అది పొంగి నూనె బయటికివచ్చే అవకాశం ఉంటుందని,ఇది దైవశక్తికి అవమానంగా భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. దీపాల నుండి నూనె వృథాగా కిందపడిపోవడం అంటే ధనం వృథా కావడం వంటిదని, ఇది లక్ష్మీదేవికి అప్రీతికి సంకేతంగా భావించవచ్చని చెబుతున్నారు.
దీపంలో నూనె పొంగడం వల్ల ఆర్థిక నష్టాలు, ఇంటి ఆర్ధిక స్థితిలో ఒడుదుడుకులు తప్పవని చెబుతున్నారు. దీపావళి రోజున ఆరోగ్యానికి చిహ్నంగా తూర్పు దిశలో, ధనానికి ఉత్తర దిశలో దీపం వెలిగించాలని నిపుణులు చెబుతున్నారు. నేతి దీపంలో పత్తి వత్తిని ఉంచి వెలిగించాలని చెబుతున్నారు. నూనె దీపంలో ఎర్ర దారం వత్తిని ఉపయోగించాలని చెబుతున్నారు. అంతేకాకుండా దీపావళి రోజున పగిలిన, పాత దీపాలను వెలిగించకూడదని చెబుతున్నారు. ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన త్రయోదశి గా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి రోజున, మరణానికి అధిపతి అయిన యమ ధర్మ రాజు పేరుతో యమ దీపం వెలిగిస్తారు. ధన త్రయోదశి తిథి 2025లో అక్టోబర్ 18న మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. కాబట్టి యమ దీపం అక్టోబర్ 18వ తేదీన శనివారం వెలిగించాలని నిపుణులు చెబుతున్నారు.