Diwali 2024: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది తెలుసా?
దీపావళి పండుగ రోజు నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 10:00 AM, Tue - 29 October 24

దీపావళి పండుగ రోజు రకరకాల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొందరు నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు. దీపావళి రోజు నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం దీపావళి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం ఆచరించాలి. ఆ తర్వాత దేవుడి మందిరం దగ్గర కూర్చుని మూడు గుప్పెడల నల్ల నువ్వులు తెల్లటి వస్త్రంలో వేసి ముడివేయాలి. ముడి చివర ఎలా ఉండాలంటే దీపం వెలిగించే ఒత్తిలా ఉండాలి. ఆ చిన్న మూటను నువ్వుల నూనెలో నానబెట్టి పక్కన పెట్టేయాలి.
దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీపూజ అనంతరం దీపాలు వెలిగించే ముందుగా ఈ నువ్వుల దీపాన్ని ఇంటి బయటకు తీసుకెళ్లి వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి నమస్కరించి స్వీట్ తీసుకుని ఇల్లంతా దీపాల వెలుగులతో నింపేయండి. ఈ దీపాన్ని బాణసంచా కాల్చడం పూర్తై లోపలకు వెళ్లేముందు కూడా వెలిగించవచ్చు. ఇంటి ప్రహరి బయట, అపార్ట్ మెంట్ వాసులైతే అపార్ట్ మెంట్ బయట వెలిగించడం మంచిది. ఇంటి ద్వారం దగ్గర, ఆవరణలో నల్ల నువ్వుల దీపం వెలిగించకూడాదట.
వెలిగించే దీపం పూర్తిగా మాడి మసైపోవాలి అందుకే అందులో కర్పూరం ఏదైనా వేస్తే ఇంకా బాగా వెలుగుతుందని పండితులు చెబుతున్నారు. తద్వారా శని ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. అయితే దీపావళి రోజు నువ్వుల దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు శని ప్రభావం తగ్గి ఆర్థిక ఇబ్బందులు ముఖం పడతాయని చెబుతున్నారు.