Holidays Effect : ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
Holidays Effect : వరుస సెలవులు కావడంతో ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
- By Sudheer Published Date - 06:39 PM, Sat - 14 September 24

Devotees Flock to Khairatabad Ganesh Idol : వరుస సెలవులు (Holidays ) కావడంతో ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణపతి (Khairatabad Ganesh Idol)ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు (Devotees Flock). ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ (Metro Station) తో పాటు బస్సు స్టాండ్ ఇలా అంత పూర్తి రద్దీగా మారింది. ఎల్బీనగర్, మియాపూర్ మార్గంలో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆయా మార్గంలో రద్దీకి తగ్గట్లుగా మెట్రో యాజమాన్యం చర్యలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా ఖైరతాబాద్ గణేశుడు ఎంతో పాపులర్. ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా సెలవు దినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రెండు రోజులు సెలవులు కావడం తో తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా గణేశుడి దర్శనం కోసం వస్తున్నారని అధికారులు చెపుతున్నారు. అటు నిమజ్జనానికి మూడు రోజుల సమయం ఉన్నందున రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇరాక్ మెట్రో స్టేషన్ లలో టికెట్ కౌంటర్ల వద్ద, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా సూచనలు చేస్తోంది. క్యూఆర్ కోడ్ టికెట్లకు, కార్డ్ ద్వారా వెళ్లే ప్రయాణికులను వేరువేరుగా పంపిస్తోంది. స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, కార్డులో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్‌లో రీఛార్జ్ చేసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. ఈ నెల 17 గణేష్ నిమజ్జనం కావడం తో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఇందుకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 17వ తేదీకి బదులుగా నవంబర్ 9(రెండో శనివారం)న పనిదినంగా ప్రభుత్వం తెలిపింది.
Read Also : Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు శివాలయమే.. సీఎం యోగి ఆదిత్యనాథ్