HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Definitions Of Sapthapadi

Sapathapadi : నవ దంపతులతో ఏడు అడుగులు వేయించడం వెనుక ఉన్న ఆంతర్యమిదే..

పెళ్లిలో అగ్నిహోత్రం చుట్టూ వేసే ఏడుగుల్లో ఒక్కో అడుగుకి ఒక్కో అర్థం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.

  • Author : News Desk Date : 12-10-2023 - 9:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
definitions of sapthapadi
definitions of sapthapadi

Sapathapadi : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కష్టమైనా, సుఖమైనా ఆలుమగలు కలిసి జీవించాలి. కానీ.. ఆధునిక కాలంలో చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. అసలు పెళ్లికి, పెళ్లిలో వేసే ఏడు అడుగులు వెనుక పరమార్థం తెలియకుండా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఆ పెళ్లి కాస్తా మూన్నాళ్ల ముచ్చటగానే ఉంటుంది. పెళ్లిలో అగ్నిహోత్రం చుట్టూ వేసే ఏడుగుల్లో ఒక్కో అడుగుకి ఒక్కో అర్థం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.

తొలి అడుగు : ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు అంటూ నూతన వధూవరులచే తొలి అడుగు వేయిస్తారు. అంటే ఆ పరమాత్ముడైన విష్ణువు మన ఇద్దరినీ ఒక్కటి చేయుగాక అని దాని అర్థం.

రెండవ అడుగు : ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు అంటారు. అంటే మన ఇద్దరికీ శక్తి లభించేలా చేయుగాక అని అర్థం.

మూడవ అడుగు : త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు అంటూ మూడవ అడుగు వేయిస్తారు. అంటే.. వివాహ వ్రతసిద్ధికోసం విష్ణువు అనుగ్రహం లభించాలి అని అర్థం.

నాల్గవ అడుగు : చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు అంటూ నాల్గవ అడుగు వేయిస్తారు. అంటే విష్ణువు మనకు ఆనందాన్ని కలిగించు గాక అని దాని అర్థం.

ఐదవ అడుగు : పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు అంటూ ఐదవ అడుగు వేయిస్తారు. అంటే ఆ విష్ణువు మన ఇద్దరికీ పశుసంపదను అనుగ్రహించుగాక అని అర్థం.

ఆరవ అడుగు : షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు అంటూ ఆరవ అడుగు వేయిస్తాయి. అంటే.. ఆరు రుతువులు మనకు సుఖమునిచ్చుగాక అని అర్థం.

ఏడవ అడుగు : సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు అంటూ ఏడవ అడుగు వేయిస్తారు. అంటే గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక అని అర్థం.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • newly married
  • sapthapadi
  • sapthapadi definitions

Related News

    Latest News

    • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

    • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

    • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

    • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

    • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd