HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Darshanam Of Srisailam Mallikharjuna

Srisailam Mallikharjuna : శ్రీశైలం మల్లిఖార్జునుడు దర్శనం!

ఆదిశక్తి కొలువుదీరిన 18 శక్తి పీఠాల్లో (Shakti Peethas) భ్రమరాంబ వెలసిన ప్రాంతంగానూ శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది.

  • Author : Maheswara Rao Nadella Date : 01-01-2023 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srisailam Mallikharjuna Temple
Srisailam Mallikharjuna Temple

గంగా నదిలో రెండు వేల సార్లు మునిగినా, లేదా కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించేంత పుణ్యం.. శ్రీశైలం (Srisailam) క్షేత్రాన్ని దర్శిస్తే లభిస్తుందని ధార్మికుల విశ్వాసం. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునులు కొలువైన ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. భువిపై వెలసిన కైలాశంగా పేరొందిన శ్రీశైలం.. దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి.

ఆదిశక్తి కొలువుదీరిన 18 శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన ప్రాంతంగానూ శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే, శ్రీశైలం (Srisailam) ‘భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి’ క్షేత్రంగా పేరొందింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఉంది. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, రెడ్డిరాజులు ఈ ఆలయాన్ని దర్శించి, ఆలయ ప్రాకారాలు నిర్మించారు.

చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్‌ రాసిన గ్రంథంలో శ్రీశైలం ప్రసక్తి ఉంది. అప్పట్లో ఎన్నో హిందూ ఆలయాలు ముస్లిం రాజుల దాడుల్లో ధ్వంసమయ్యాయి. అయితే, శ్రీశైలంలోని ఈ ఆలయాన్ని ధ్వంసం చేయకపోగా దీన్ని అత్యంత పవిత్రధామంగా భావించడం గమనార్హం. ముఖ్యంగా ఔరంగజేబు కాలంలో కర్నూలు జిల్లాను జాగీరుగా పొందిన దావుద్‌ ఖాన్‌ అనే సేనాని సోదరుడు ఇబ్రహీం ఖాన్‌ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం విశేషం.

మల్లిఖార్జున క్షేత్రం వెలసిందిలా:

కృష్ణానది తీరంలో బ్రహ్మగిరి రాజధానిగా చంద్రకేతుడనే రాజు పాలించేవాడు. సంతానం కోసం పరితపిస్తున్న ఆ రాజుకు లేకలేక ఓ అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు జైత్రయాత్ర ముహూర్తం పెట్టారు. చంద్రకేతుడు బ్రహ్మగిరి నుంచి మొదలుపెట్టిన జైత్రయాత్రను రాజ్య విస్తరణ కాంక్షతో కొన్నేళ్లపాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి, తిరిగి బ్రహ్మగిరికి చేరుకున్నాడు.

అంతఃపురంలో ఓ అందమైన కన్యను చూసి చంద్రకేతుడు మనసు పారేసుకున్నాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంటపడ్డాడు. అది చూసిన అతని భార్య.. ఆమె మరెవరో కాదు, మీ కూతురు చంద్రమతి అని చెప్పినా చంద్రకేతుడు పట్టించుకోలేదు. చంద్రమతి చేతులు జోడించి ‘నేను మీ కుమార్తెను. వదిలిపెట్టండి’ అని వేడుకున్నా.. చంద్రకేతుడు కామకాంక్షతో ఆమెను లోబరుచుకోడానికి ప్రయత్నించాడు. దీంతో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఓ గుహలో తలదాచుకుంది. దీంతో ఆమె కోసం చంద్రకేతుడు ఆ గుహ బయటే మాటువేశాడు. శివ భక్తురాలైన చంద్రమతి మరోదారిలేక.. తండ్రి నుంచి తనను కాపాడాలని శివుడిని ప్రార్థించింది. ఆమె మొరాలకించిన శివుడు చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ పాతాళగంగలో పడింది. అందువల్లే అక్కడి నీరు పచ్చగా ఉంటుందని భక్తులు నమ్ముతారు.

గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి.. అక్కడో అద్భుతాన్ని చూస్తుంది. ఓ గోవు పొదుగు నుంచి కారుతున్న పాలధారతో అభిషిక్తమవుతున్న శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దీంతో అక్కడే ఆమె శివాలయాన్ని నిర్మించింది. స్వామివారిని నిత్యం మల్లె పూలతో అర్చించేది. ఆమె భక్తిని మెచ్చిన శివుడు.. చంద్రమతి సమర్పించిన మల్లెదండను తన సిగలోని నెలవంక, సురగంగకు నడుమ అలంకరించుకున్నారట. అందుకే ఆ ఆలయానికి మల్లిఖార్జున స్వామి ఆలయంగా పేరొందిందని పూర్వికులు చెబుతారు.

పుణ్యక్షేత్రమే కాదు, పర్యాటక కేంద్రం కూడా: 

నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైలం కేవలం పుణ్యక్షేత్రంగానే కాకుండా, పర్యాటక స్థలంగా కూడా ఆకట్టుకుంటోంది. పచ్చని పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో పర్యటన భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడి శ్రీశైలం డ్యామ్ అందాలు వర్షాకాలంలో మరింత రమణీయంగా ఉంటాయి. శ్రీశైలానికి 3 కిమీల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం కూడా తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం. హైదరాబాద్‌‌కు 214 కి.మీ, విజయవాడకు 263 కి.మీల, కర్నూలుకు 180 కి.మీల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడికి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

Also Read:  Tirumala Darshanam Record : తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • god
  • history
  • Lord
  • Mallikharjuna
  • srisailam
  • temple

Related News

Why is *Thamboolam* (betel leaves and areca nuts) offered? On what occasions is it given? What is its significance?

Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

తమలపాకులు, వక్కలు, సున్నం, సుగంధ ద్రవ్యాలు కలిసి ఇచ్చేదే తాంబూలం. జీర్ణశక్తితోపాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు రకరకాల తాంబూలాలు కడుతుంటారు. సాధారణంగా తాంబూలం అనేది తమలపాకులతోనే ఉంటుంది. కానీ పలు సందర్భాల్లో మామిడి, మారేడు ఆకులతో ఇచ్చే తాంబూలాలు కూడా ఉన్నాయి. కవులను గ్రంథరచనకు ప్రోత్సహిస్తూ మహారాజులు కర్పూర తాంబూలాలు, బంగారు తాంబూలాలు ఇచ్చేవారని తెలుసు. ఆరోగ్యం రక్

  • Is this what the abode of Lakshmi looks like?

    Lakshmi Nivasam: లక్ష్మీ నివాసం ఇలా ఉంటుందా..?

  • Do you know what precautions to take regarding the main entrance of your house if you wish to receive the blessings of Goddess Lakshmi?

    Lakshmi: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd