HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Cm Revanth Reddy Approved The Formation Of Yadagirigutta Temple Board

Yadadri : యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆమోదం

Yadadri : టీటీడీ తరహాలో యాదగిరిగుట్టలో టెంపుల్ బోర్డు ఉండాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం యాదాద్రిగా పిలుస్తున్న పేరును యాదగిరిగుట్టగా మార్చాలని సూచించారు.

  • Author : Latha Suma Date : 08-11-2024 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy approved the formation of Yadagirigutta Temple Board
CM Revanth Reddy approved the formation of Yadagirigutta Temple Board

Yadagirigutta Temple Board : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆమోదం తెలిపారు.

టీటీడీ తరహాలో యాదగిరిగుట్టలో టెంపుల్ బోర్డు ఉండాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం యాదాద్రిగా పిలుస్తున్న పేరును యాదగిరిగుట్టగా మార్చాలని సూచించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీని తీసుకురావాలని, అవసరమైతే టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. కొండపై నిద్రచేసే భక్తులు తమ మొక్కుల్ని తీర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని, బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులను పూర్తి చేయాలని తెలిపారు.

అంతేకాక.. ఆలయ అభివృద్ధి కోసం చేస్తున్న భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఈ మేరకు అవరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలని ఆదేశించారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకుని.. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చాలని ఆదేశించారు.

Read Also: Vladimir Putin : భారత్‌ ఓ గొప్ప దేశం: రష్యా అధ్యక్షుడు ప్రశంసలు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Yadadri Lakshmi Narasimha Swamy
  • Yadagirigutta Temple Board
  • Yadagirigutta Temple Board Approval

Related News

Indiramma Houses

CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమ‌వారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండవ దశను ప్రారంభించనున్నారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ పథకం మొదటి దశ కింద కేరమేరి మండలం, కొత్తారి గ్రామంలో కోలం తెగకు చెందిన ఆదివాసుల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహప్రవేశం చేస్తారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండ

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd