Shivaji Temple: శివాజీ ఆలయం ప్రారంభం.. ఔరంగజేబ్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయానికి(Shivaji Temple) తీర్థయాత్రా ప్రదేశంగా అధికారిక గుర్తింపు ఇస్తాం.
- By Pasha Published Date - 05:18 PM, Mon - 17 March 25

Shivaji Temple: థానే జిల్లా భివండి పట్టణంలో ఉన్న మరాడేపాడా ఏరియాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆలయాన్ని నిర్మించారు. దీన్ని ఇవాళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రారంభించారు. అయోధ్య రామయ్య విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్, ఈ శివాజీ ఆలయంలోని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని చెక్కారు. శివాజీ ఆలయం 4 ఎకరాల్లోని 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 5వేల చదరపు అడుగుల రాతి కంచెను ఈ ఆలయం చుట్టూ నిర్మించారు. ఆలయం పరిధిలో 36 ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో మరాఠా సామ్రాజ్యపు ఒక్కో దశకు సంబంధించిన విశేషాల వర్ణన ఉంది. శివక్రాంతి ప్రతిష్ఠాన్‌కు చెందిన రాజు చౌదరి ఈ ఆలయాన్ని నిర్మించారు.
Also Read :Deputy CM Bhatti : గ్రీన్ ఎనర్జీలో లక్ష కోట్ల పెట్టుబడి.. ముందుకొచ్చిన కంపెనీలు : డిప్యూటీ సీఎం
సీఎం ఫడ్నవిస్ వ్యాఖ్యల్లోని కీలక పాయింట్స్
- ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయానికి(Shivaji Temple) తీర్థయాత్రా ప్రదేశంగా అధికారిక గుర్తింపు ఇస్తాం.
- కేవలం చారిత్రక రికార్డుల కోసమే ఔరంగజేబ్ సమాధిని కాపాడుతున్నాం. దాన్ని రక్షించడంలో గౌరవభావానికి తావు లేదు.
- ప్రజల స్తుతిని పొందే అర్హత ఛత్రపతి శివాజీ ఆలయానికి ఉంది. ఔరంగజేబ్ సమాధికి ఆ అర్హత లేదు. ఒకవేళ ఎవరైనా ఔరంగజేబును పొగిడితే ఊరుకోం.
- మహారాష్ట్రలోని 12 శివాజీ కోటలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని యునెస్కోకు ప్రతిపాదనలు పంపాం.
- ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను మోసపూరితంగా బంధించిన సంగమేశ్వర్‌లో ఒక ప్యాలెస్‌ను నిర్మించాలని భావిస్తున్నాం.
- ఆగ్రా కోటలోని ఒక సెల్‌లో కొంతకాలం పాటు శివాజీ మహరాజ్‌ను బంధించారు. దాని నిర్వహణ బాధ్యతలను మహారాష్ట్ర సర్కారుకు ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరాం. ఆ సెల్‌లో శివాజీ స్మారకం ఏర్పాటు చేస్తాం.
- ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్శనం లేకుండా ఏ దేవుడి దర్శనమూ ఫలించదు. ఎందుకంటే శివాజీ వల్లే మీరు, నేను హిందువులుగా చెప్పుకోగలుగుతున్నాం. మన ఆరాధ్య దేవతలను చూడగలుగుతున్నాం.