Srivari Darshanam Canceled: తిరుమలలో ఆ రెండ్రోజుల పాటు బ్రేక్ దర్శనాలు రద్దు
22న తెలుగు సంవత్సరాది ఉగాది (శ్రీ శోభకృత్ నామ సంవత్సరం) తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 21, 22 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- Author : Vamsi Chowdary Korata
Date : 11-03-2023 - 3:56 IST
Published By : Hashtagu Telugu Desk
22న తెలుగు సంవత్సరాది ఉగాది (శ్రీ శోభకృత్ నామ సంవత్సరం) తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 21, 22 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఆ రెండ్రోజులకు సంబంధించి ఎలాంటి సిఫారసలు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.
మార్చి 22న శ్రీవారి (Srivari) సన్నిధిలో బంగారు వాకిలి వద్ద ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఉగాది నాడు సుప్రభాత సేవ తర్వాత ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి, విష్వక్సేనులకు విశేష సమర్పణ ఉంటుంది.
7.00 గంటల నుంచి 9.00 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయ ప్రవేశం చేస్తారు. అనంతరం శ్రీవారి (Srivari) మూలవిరాట్టును, ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో అలంకరిస్తారు. ఆ తర్వాత ముఖ్య ఘట్టమైన పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
Also Read: Erukamamba Ammavaru: విశాఖపట్నంలో ఉన్న తల లేని అమ్మవారి విశిష్టత తెలుసుకోండి.