Bhadrachalam History: భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి వారి చరిత్ర..!
భద్రుడు అనే మహర్షి శ్రీ రాముడిని ఒక వరం అడిగాడు.అసలు భద్రుడు, ఎవరు అంటే.. మేరు పర్వత రాజుకి 2 కొడుకులు. ఇద్దరూ అసమాన విష్ణు భక్తులు..
- Author : Vamsi Chowdary Korata
Date : 30-03-2023 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Bhadrachalam Sri Ramachandra Swamy : భద్రుడు అనే మహర్షి శ్రీ రాముడిని ఒక వరం అడిగాడు.అసలు భద్రుడు, ఎవరు అంటే.. మేరు పర్వత రాజుకి 2 కొడుకులు. ఇద్దరూ అసమాన విష్ణు భక్తులు.. ముక్తి పొంది పర్వతాలుగా వరం పొందారు రత్నుడు అన్నవరం లో రత్నగిరిగా.. భద్రుడు భద్రాచలం (Bhadrachalam) లో ‘భద్రగిరి’ గా మారారు.. ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు దేవునివై కొలువై వుండాలి.దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను., తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు.. కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు.
అప్పుడు భద్రుడు ఘోరతపస్సు చేయటంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో వలె సీతా లక్ష్మణ సమేతంగా వచ్చి ఆ భద్రగిరి కొండపై వెలిసాడు అయితే ఆయన.. భువి కి వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం, విల్లుతో పాటు విష్ణువు చేతిలో వుండే శంఖచక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపునే లక్ష్మణుడు ఎడమవైపున నిల్చొన్నట్లు పురాణాలను బట్టి మనకు తెలుస్తుంది.
అందుకే భద్రాచలం లో మూల విగ్రహం ఎక్కడా లేని విధంగా రూపం వుంటుంది. శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో వుండగా లక్ష్మణ స్వామి ఎడమవైపున వున్నట్లు కనపడుతుంది. ఆయన నాలుగు చేతులలో కుడివైపున వున్న రెండు చేతులలో శంఖము, బాణము వుండగా, వున్న రెండు చేతులలో విల్లు, చక్రము మనకు దర్సనము ఇస్తాయి.
Also Read; Chaitra Navaratri: చైత్ర నవరాత్రుల్లో ఈ 5 కలలు వస్తే.. మంచి రోజులు క్యూ కట్టినట్టే..!