HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Benefits Of Performing Lord Shiva Abhisekham

Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది..?

తాత్పర్యము: శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు కాడి పశువుగా పడి వుంటుందట.

  • Author : hashtagu Date : 06-06-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Abhisekham
Abhisekham

నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు

తాత్పర్యము: శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు కాడి పశువుగా పడి వుంటుందట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి…సకలైశ్వర్యములు సమకూరతాయి.

నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలంతో అభిషేకించినా శివయ్య సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు ఇట్టే నెరవేరస్తాడు. అందుకే ఆయనను భోళా శంకరుడు అంటారు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతుంటారు. అలా వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత ఉంది. అంతేకాదు ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి.మన పెద్దలు విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. శివుడ్ని ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాం.

1.ఆవు పాలతో- సర్వ సౌఖ్యాలు
2.ఆవు పెరుగు- ఆరోగ్యం, బలం
3.ఆవు నెయ్యి- ఐశ్వర్యాభివృద్ధి
4.చెరకు రసం (పంచదార)- దుఃఖ నాశనం, ఆకర్షణ
5. తేనె-తేజో వృద్ధి
6. భస్మ జలం-మహా పాప హరణం
7. సుగంధోదకం – పుత్ర లాభం
8. పుష్పోదకం- భూలాభం
9. బిల్వ జలం – భోగ భాగ్యాలు
10.నువ్వుల నూనె- అపమృత్యు హరణం
11. రుద్రాక్షోదకం- మహా ఐశ్వర్యం
12. సువర్ణ జలం-దరిద్ర నాశనం
13. అన్నాభిషేకం- సుఖ జీవనం
14. ద్రాక్ష రసం- సకల కార్యాభివృద్ధి
15. నారికేళ జలం- సర్వ సంపద వృద్ధి
16. ఖర్జూర రసం- శత్రు నాశనం
17. దూర్వోదకం- ద్రవ్య ప్రాప్తి
18. ధవళొదకమ్- శివ సాన్నిధ్యం
19. గంగోదకం-సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
20. కస్తూరీ జలం-చక్రవర్తిత్వం
21. నేరేడు పండ్ల రసం-వైరాగ్య ప్రాప్తి
22. నవరత్న జలం- ధాన్య గృహ ప్రాప్తి
23. మామిడి పండు రసం- దీర్ఘ వ్యాధి నాశనం
24. పసుపు, కుంకుమ- మంగళ ప్రదం
25. విభూది- కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.

విష్ణువు అలంకారప్రియుడైతే…శివుడు అభిషేక ప్రియుడు. శివుడు అభిషేకానని చాలా ప్రియంగా భావిస్తుంటాడు. కాబట్టి అభిషేక ప్రియుడు అంటారు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. అందుకే శివార్చనల అభిషేకం చాలా ముఖ్యమైంది. గంగ జలరూపమైన…జలం పంచభూతాలలోనూ శివుని అష్టమూర్తులలోనూ ఒకటి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • abhisekham
  • benefits
  • devotional
  • Lord Shiva
  • prosperity

Related News

Simply placing these items in your home's prayer room is enough—you are sure to receive Goddess Lakshmi's blessings!

Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

హిందువులలో ఎక్కువ శాతం మంది కొలిచే దేవతలలో లక్ష్మీదేవి కూడా ఒకరు. సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కష్టాల నుంచి గట్టెక్కుతారని నమ్ముతారు. అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదని భావిస్తారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునే వారు తమ ఇంట్లోని పూజా మందిరంలో కొన్

  • Are you placing a picture of Lord Shiva in your home? If so, follow these precautions; otherwise, you might incur Shiva's wrath!

    Lord Shiva: ఇంట్లో శివుడి చిత్రపటం పెట్టుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..లేకుంటే శివాగ్రహానికి గురవుతారు..!!

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd