Baba Vanga : బాబా వంగా జోస్యం.. 2025 ఫిబ్రవరి తర్వాత వాళ్లకు అఖండ ధనయోగం
2025 సంవత్సరం ఫిబ్రవరి నెల తర్వాత కొన్ని రాశుల వారి జీవితాలు మారుతాయని బాబా వంగా(Baba Vanga) అప్పట్లో జోస్యం చెప్పారట.
- By Pasha Published Date - 11:37 AM, Mon - 17 February 25

Baba Vanga : బాబా వంగా చాలా ఫేమస్. ఆయన ఐరోపాలోని మసిడోనియా ప్రాంతంలో జన్మించారు. 1966లో ఈ లోకాన్ని బాబా వంగా విడిచారు. తన జీవిత కాలంలో ఆయన ఎన్నో జ్యోతిష్య శాస్త్ర అంచనాలను చెప్పారు. వాటిలో చాలావరకు నిజం అవుతున్నాయని ఎంతోమంది బలంగా నమ్ముతారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల తర్వాత కొన్ని రాశుల వారి జీవితాలు మారుతాయని బాబా వంగా(Baba Vanga) అప్పట్లో జోస్యం చెప్పారట. ఇంతకీ అకస్మాత్తుగా లక్కును చూడబోతున్న ఆ రాశులు ఏవి ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
డబ్బు సంపాదనకు గొప్ప అవకాశాలు
మేషరాశి వారికి 2025 సంవత్సరం ఫిబ్రవరి తర్వాత సంపాదనకు అవకాశాలు పెరుగుతాయి. కొత్తకొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అయితే వాటిని గుర్తించే సామర్థ్యం కలిగిన వారికే .. ఈ అవకాశాలు చేతికి చిక్కుతాయి. వ్యాపారంలో లాభాలు పండుతాయి. ఉద్యోగంలో పురోగతి వస్తుంది. ఏ ప్రొఫెషన్ చేసే వారికైనా కామన్ సెన్స్ ఉంటే అపార ఆదాయ అవకాశాలు కనిపిస్తాయి.
విజయీభవ
వృషభ రాశి వారికి 2025లో ఫిబ్రవరి నెల తర్వాత విజయానికి తలుపులు తెరుచుకుంటాయి. కొంతమందికి అప్రయత్నంగానే ఈ మార్గం కనిపిస్తుంది. ఇంకొందరు ప్రయత్నించాల్సిందే. ఈక్రమంలో కుటుంబ సభ్యులు, నమ్మకస్తులు, శ్రేయోభిలాషులు, నిపుణులు, వ్యాపార భాగస్వాముల సహాయ సహకారాలను తీసుకోవాలి. తద్వారా వర్తకం, వ్యాపారం, ఉద్యోగం ఇలా ప్రతీచోటా విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి.
గ్రహాలు అనుకూలం
కర్కాటక రాశి వారికి 2025లో ఫిబ్రవరి తర్వాత శుభాలు జరుగుతాయి. చేసే వివిధ పనులకు గ్రహాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల విస్తరణకు మార్గాలు సుగమం అవుతాయి. వ్యాపార ప్రణాళికలు సఫలం అవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతి లభిస్తుంది. దైవబలం పొందేందుకు పూజలు చేస్తే.. గ్రహాలు మరింతగా అనుకూలిస్తాయి.
Also Read :KCR Birthday : కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
అదృష్ట సంవత్సరం
సింహరాశి వారికి 2025 సంవత్సరం ఫిబ్రవరి తర్వాత లక్కులు వరుసగా తలుపు తడతాయి. ఈ రాశి వారికి 2025 అనేది అదృష్ట సంవత్సరంగా నిలుస్తుంది. వారికి ధనప్రాప్తి కలుగుతుంది. అప్పులు వసూలు అవుతాయి. ఆస్తులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి.గ్రహాల అనుకూలత వల్ల ఇదంతా జరుగుతుంది.
ధైర్యే లక్ష్మి
కుంభ రాశి వారికి 2025 ఫిబ్రవరి తర్వాత మంచి రోజులు వస్తాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. అవి కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటే కాసుల వర్షం కురవడం ఖాయం. పెట్టుబడులను లాభాల వర్షాన్ని కురిపిస్తాయి. సుదీర్ఘకాలంగా వివిధ చోట్ల పెట్టుబడులు పెట్టిన వారికి భారీ ప్రతిఫలంతో డబ్బులు తిరిగొస్తాయి.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.