Ayodhya Ram temple:ఇక పై అయోధ్య రామాలయం ప్రతిరోజు గంట సేపు మూసివేత..ఎందుకో తెలుసా..
- Author : Latha Suma
Date : 16-02-2024 - 4:08 IST
Published By : Hashtagu Telugu Desk
Ayodhyas Ram temple : ఇక పై అయోధ్యలో రామాలయాన్ని(Ayodhya’s Ram temple) ఈ శుక్రవారం నుంచి ప్రతి రోజు ఒక గంట సేపు(every day One hour)మూసి ఉంచనున్నారు. మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ ఆలయ ప్రధాన పూజారి ఈ విషయాన్ని తెలిపారు. జనవరి 22వ తేదీన ఆలయాన్ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేయలేదు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. తెల్లవారుజామున 4 గంటలకే బాలరాముడికి పూజలు చేస్తారు. కానీ రెండు గంటలు విరామం తీసుకుని ఆరు గంటల నుంచి దర్శనంకు అవకాశం కల్పిస్తారు. రామ్‌లల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంటల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండలేరని, రామ్‌లల్లాకు రెస్టు(Rest) అవసరమని, మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 1.30 వరకు ఆలయాన్ని మూసివేయాలని ట్రస్టు నిర్ణయించినట్లు ఆచార్య సత్యేంద్ర దాస్(Acharya Satyendra Das)తెలిపారు. రామాలయాన్ని తెరవడానికి ముందు టెంటులో ఉన్న సమయంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం ఉండేది. దాంట్లో మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు బ్రేక్ తీసుకునేవారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, అయోధ్య కౌసల్య రాముడు.. అయోధ్య లో జనవరి 22వ తేదీన కొలువు దీరాడు. బాలరాముడి విగ్రహాన్ని కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు. ప్రధాని మోడీ(pm modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగింది. భారత కాలమానం ప్రకారం సరిగ్గా 22వ తేదీన మధ్యాహ్నం 12.29 నిమిషాలకు ముఖ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్మించారు. సుమారు 84 సెకన్ల పాటు అసలు క్రతువును నిర్వహించారు. కీలకమైన ఈ 84 సెకన్ల సమయంలోనే రాముడి మూర్తికి ప్రాణ ప్రతిష్ట చేశారు. రాముడి విగ్రహం కండ్లకు ఉన్న వస్త్రాన్ని ప్రధాని తొలగించారు. ఆ తర్వాత పుష్పాలతో రామున్ని పూజించారు. ప్రాణ ప్రతిష్ట సమయంలో 50 శంఖాలు ఊదారు. గర్భిగుడి పూజలు ప్రధాని మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
read also :Urine : మూత్రమే కదా అని ఈజీగా వదిలేయకండి..అందులో కరెంట్ ఉంది..!!