Ayodhya Ram Temple: ప్రపంచ రికార్డు.. అయోధ్య రామ మందిరంలో 28 లక్షల దీపాలతో దీపావళి!
దీపోత్సవ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు వాలంటీర్ల బృందం శనివారం జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ రామ్‌కీ పౌరీ ఘాట్‌లకు చేరుకోవడంతో వాలంటీర్లు తొలి అడుగు వేశారు.
- By Gopichand Published Date - 10:49 AM, Mon - 28 October 24

Ayodhya Ram Temple: అయోధ్య రామయ్య (Ayodhya Ram Temple) తొలి దీపావళి వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పండగరోజున సాకేతపురి, సరయూ తీరం 28 లక్షల దీపాలతో శోభాయమానంగా వెలిగిపోనుంది. యూపీ ప్రభుత్వం ఈ దీపోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీపాలు ఎక్కువసేపు వెలిగేలా, కాలుష్యం వెలువడకుండా ప్రత్యేకమైన కుందులను తయారు చేయిస్తోంది. ఈ దీపోత్సవానికి 2వేల సూపర్ వైజర్లు, 30వేల మంది వాలంటీర్లతో 55 ఘాట్లలో దీపాలు అలంకరిస్తారు.
దీపోత్సవ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు వాలంటీర్ల బృందం శనివారం జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ రామ్‌కీ పౌరీ ఘాట్‌లకు చేరుకోవడంతో వాలంటీర్లు తొలి అడుగు వేశారు. రామ్ కి పైడిలోని మొత్తం 55 ఘాట్‌లపై తొలిరోజు వాలంటీర్లు ఆరు లక్షల దీపాలను వెలిగించారు. అక్టోబర్ 28 సాయంత్రంలోగా అన్ని ఘాట్‌ల వద్ద 28 లక్షల దీపాల ఏర్పాటు పనులు పూర్తవుతాయి.
Also Read: Rama Ekadashi : ఇవాళ రామ ఏకాదశి.. ఉపవాసం, పూజా విధానం వివరాలివీ..
వాలంటీర్ల బృందం ఉదయం 11 గంటలకు రామ్ కి పైడికి చేరుకుంది. అభిజీత్ ముహూర్తంలో జై శ్రీరామ్ అని నినదించడం ద్వారా దీపాలు వెలిగించే ప్రక్రియ ప్రారంభమైంది. దీపోత్సవ్‌ను చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు వైస్ ఛాన్సలర్ ప్రొ.ప్రతిభా గోయల్ ఆధ్వర్యంలో దీపోత్సవ్ ట్రాఫిక్ కమిటీ కోఆర్డినేటర్ ప్రొ.అనూప్‌కుమార్ ఆధ్వర్యంలో జై శ్రీరామ్ నినాదాలతో నాలుగు బస్సులు దీపోత్సవ్ వేదిక వద్దకు బయలుదేరాయి.
దీపోత్సవ్ నోడల్ అధికారి ప్రొ.సంత్ శరణ్ మిశ్రా మాట్లాడుతూ.. దీపోత్సవ్ వైభవం కోసం 55 ఘాట్లకు దీపాల సరఫరా పూర్తి చేశామన్నారు. శనివారం నుంచి ఘాట్‌లపై దీపాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అక్టోబరు 28 నాటికి దీపాల ఏర్పాటు పనులు పూర్తవుతాయి. అక్టోబర్ 29న గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం దీపాలను లెక్కించనుంది. అక్టోబరు 30న దీపోత్సవం రోజున దీపాలకు నూనె పోసి, వత్తిని ఉంచి వెలిగించే కార్యం నిర్వహిస్తారు. ఈ వెలుగుల పండుగలో యూనివర్సిటీ క్యాంపస్, 14 కాలేజీలు, 37 ఇంటర్ కాలేజీలు, 40 స్వచ్ఛంద సంస్థలు పాలుపంచుకున్నాయని తెలిపారు.