Vasthu Tips: ఏంటి ఇంట్లో నిద్రపోవడానికి, వాస్తుకి సంబంధం ఉందా? ఆ దిక్కులో పడుకోకూడదా?
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పడుకోవడానికి వాస్తు కూడా సంబంధం ఉంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అలాగే ఇంట్లో నిద్రపోవడానికి కూడా కొన్ని రకాల వాస్తు నియమాలు ఉన్నాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:02 PM, Thu - 8 May 25

వాస్తు శాస్త్ర ప్రకారం మనం ఇంట్లో పడుకోవడానికి వాస్తు కి సంబంధం ఉంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఇంట్లో పడుకోవడానికి కూడా దిక్కులు ఉంటాయట. అంతేకాకుండా కొన్ని రకాల దిక్కుల్లో పడుకోవడం అసలు మంచిది కాదని చెబుతున్నారు. మరి ఇంట్లో ఏ దిక్కున పడుకోవాలి? ఏ దిశలో తల పెట్టి పడుకోవాలి? ఏ దిశలో కాళ్లు పెట్టి పడుకోవాలి? ఎలా నిద్రపోతే మనకు అంతా మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పడుకున్నప్పుడు ఏ రాశి వారైనా సరే తూర్పున కాళ్లు పెట్టి, పడమర తల పెట్టి పడుకున్నట్లైతే సూర్యోదయం వరకు పడుకోకూడదట.
సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలని, అలా చేస్తే ఆ ఇంటికి శుభప్రదంగా ఉంటుందని వారికి ప్రశాంతంగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. అలాగేస్త్రీలు దక్షిణాన తల, ఉత్తరాన కాళ్లు పెట్టి పడుకుంటే మంచిదట. నిద్ర లేవగానే ఉత్తరం ముఖంగా లేస్తాం. ఉత్తరం ముఖంగా చూడటం అంటే లక్ష్మిదేవిని దర్శించుకున్నట్లే అని చెబుతున్నారు. తర్వాత తూర్పుకి తిరుగుతాం. లేవడం ఉత్తర ముఖంగా లేచి, దిగడం తూర్పుగా వెళ్లిపోతాం కాబట్టి దాని వల్ల చక్కని నిద్ర పడుతుందట. మనం అనుకున్న ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందట. అలాగే చెడు కలలు కూడా రావట. మనశ్శాంతిగా ఉంటారని చెబుతున్నారు. ఉత్తరం తల చేసి, దక్షిణం కాళ్లు పెట్టి పడుకోవడం వల్ల నిద్ర లేవగానే దక్షిణం ముఖం చూస్తారు.
అలాంటి వారికి దిన దిన గండమే అని,అంటే నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయని, ప్రమాదాలు కూడా జరుగుతాయని,ప్రాణ నష్టం అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఆయుష్షు లోపం ఉన్నట్లైతే మరింత తొందరగా జరిగిపోతుంది. ఉత్తరం తల పెట్టి దక్షిణం ముఖంగా లేవకూడదట. తూర్పు తల పెట్టి, పడమర ముఖంగా లేవడం అన్నది అత్తగారి ఇంట్లో ఇలా చేయాలట. మన పుట్టింట్లో మనం అలా చేయకూడదట. అత్తగారి ఇంటికి అల్లుడు వెళ్లినప్పుడు తూర్పు తల పెట్టి, పడమర కాలు పెట్టి నిద్రపోతే అత్తగారి ఇంటికి కలిసి వస్తుందట. లక్ష్మీదేవి, కుబేర స్థానం, గురు స్థానం ఈ మూడూ కలగలిపిన స్థానమే ఉత్తర భాగం. అది స్థిర స్థానం. లక్ష్మీదేవి కొలువై ఉంటుందని,ఆమె ఉండాల్సిన స్థానంలో మనం దాచుకోగలిగితే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి స్థిరపడుతుందట. ఇంట్లో నిత్యం ధనం ఉంటుంది. ఒకవేళ వెళ్లిపోయినా మళ్లీ వస్తుందని చెబుతున్నారు.