Anna Lezhneva : మార్క్ శంకర్ పేరు మీద రూ. 17 లక్షలు దానం చేసిన పవన్ భార్య
Anna Lezhneva : తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి వెళ్లి, తన కుమారుడు మార్క్ శంకర్ పేరుతో రూ.17 లక్షల విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు
- By Sudheer Published Date - 02:39 PM, Mon - 14 April 25

తన కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) కోలుకోవడంతో పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల (Anna Lezhneva) తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల మార్క్ శంకర్ సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడగా, చికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో పవన్ తన భార్య, కుమారుడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అన్నా కొణిదెల తిరుమలకు వచ్చి తలనీలాలు అర్పించి, మొక్కు తీర్చుకున్నారు.
Holidays : మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు..వారికే పండగే
ఈ రోజు వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు, శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చి, స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకున్నారు.
అనంతరం తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి వెళ్లి, తన కుమారుడు మార్క్ శంకర్ పేరుతో రూ.17 లక్షల విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ విరాళంతో ఒక రోజు మధ్యాహ్న భోజనం నిర్వహించనున్నారు. అంతేకాకుండా అన్నా స్వయంగా అన్నప్రసాదాన్ని భక్తులకు వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. ఇది చూసిన భక్తులు , అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు.