All Time Record: రూ. 46 లక్షలు పలికిన అల్వాల్ గణేశుడి లడ్డూ..!!!
తెలుగు రాష్ట్రాల్లో గణేశుడి లడ్డూలు రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. లడ్డూ వేలం పాటలు పెరిగిపోతున్నాయి.
- By hashtagu Published Date - 09:34 PM, Sat - 10 September 22

తెలుగు రాష్ట్రాల్లో గణేశుడి లడ్డూలు రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. లడ్డూ వేలం పాటలు పెరిగిపోతున్నాయి. వేలంపాటల్లో భక్తులు కూడా భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. ఈ వేలం పాటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నమోదైన వేల పాటలకు మించి వినాకుడు లడ్డూ వేలం పాటలో ఆల్ టైం రికార్డు నమోదైంది. హైదరాబాద్ అల్వాల్ ఓ భక్తుడు ఏకంగా రూ. 45, 99,999లకు వచ్చించి లడ్డూను దక్కించుకున్నాడు.
కనాజీగూడ మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో భారీ గణేశుడిని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శనివారం జరిగిన లడ్డూ వేలం పాటలో వెంకట్ రావు అనే భక్తుడు గణేశుడి లడ్డూను దక్కించుకున్నాడు. రూ. 1 తక్కువ 46లక్షలకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నాడు. ఈ ధర ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన అన్ని వేలం పాటల్లోకెల్లా అత్యధిక ధర పలికిన లడ్డూగా రికార్డులోకి ఎక్కింది.