HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >After 17 September 2022 These Seven Zodiac Signs Could Be Lucky

7 Zodiac Signs: సెప్టెంబర్ 17 తర్వాత.. 7 రాశుల వాళ్ళ అదృష్టం సూర్యుడిలా మెరుస్తుంది!!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పు లేదా వాటి కదలికలలో మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.

  • Author : Hashtag U Date : 09-09-2022 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Zodiac Signs
Zodiac Signs

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పు లేదా వాటి కదలికలలో మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. సెప్టెంబర్‌లో చాలా ముఖ్యమైన గ్రహాలు కొన్ని రాశిచక్రాల అదృష్టాన్ని మార్చబోతున్నాయి. ఈ గ్రహాల మార్పు కొన్ని రాశుల వారికి నష్టం కలిగించగా.. కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకు రాబోతోంది. ముఖ్యంగా బుధుడు, శుక్రుడు, సూర్యుడు ఈ మాసంలో తమ స్థానాన్ని మార్చు కుంటున్నారు. ఈ మూడు గ్రహాల సంచారం కొన్ని రాశిచక్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదట సెప్టెంబర్ 10 న బుధ( మెర్క్యురీ) గ్రహం కన్య రాశిలోకి తిరోగమనం చెందుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 17న శుక్రుడు సింహరాశిలో స్థిరపడుతాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 24న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కొన్నిసార్లు గ్రహాల సంచారం వల్ల శుభ యోగాలు ఏర్పడతాయి.
సెప్టెంబర్ 17 తర్వాత బుధుడు, సూర్యుడు, సింహరాశిలో కలిసి ఉంటారు. బుధుడు, సూర్యుడు ఒకే రాశిలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.
అయితే ఏ రాశి వారికి ఇది శుభ యోగమో.. ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం.

కర్కాటకం: ఈ కాలంలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.

మేషం: ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ కాలం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.

ధనుస్సు: ధనుస్సు రాశి వారికి బుధాదిత్య యోగం శుభప్రదంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ సమయంలో సంపద, శ్రేయస్సు కలిసి వస్తాయి. డబ్బు పెట్టుబడికి అనుకూలమైన సమయం ఇది. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది.

మిథునరాశి: బుధ, సూర్యుని కలయిక మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారులు లాభపడతారు. కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు.

వృషభం : ఈ రాశి వారికి అది చాలా టఫ్ టైం. పెద్దవైన, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది. ఫలితంగా వారిపై మానసిక ఒత్తిడి చాలా పెరిగే ఛాన్స్ ఉంటుంది.

సింహారాశి : ఈ టైం లో మీరు సూర్యుడిని చూస్తే అంత మంచిది కాదు. మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే చాలా ఆచితూచి వ్యవహరించాలి. మీరు ఏదైనా తప్పుగా మాట్లాడితే మొత్తం కెరియర్ ప్రశ్నార్ధకంగా మారే ముప్పు ఉంటుంది. అందుకే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని మీరు శాంతంగా ఉంచండి.

తుల రాశి : సూర్యుడిని చూశాక.. ఈ రాశి వాళ్లకు విదేశీ యాత్ర చేసే యోగం కలుగుతుంది.చాలా ఏళ్లుగా ఏదైనా విదేశానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న వాళ్లను సూర్య భగవానుడు చల్లని చూపు చూడనున్నాడు.

వృశ్చిక రాశి : ఈ రాశి వాళ్ళ ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఒకటికి మించిన మార్గాల ద్వారా ఆదాయం చేకూరుతుంది.ఇలా వచ్చే ధనంతో మీకు ఎంతో లబ్ది కలుగుతుంది. కుటుంబ జీవితంలో ఇంటి వద్ద మీకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.

మకర రాశి : ఈ రాశి వాళ్లకు టైం చాలా టఫ్ గా ఉంటుంది. వేరే వాళ్ళతో వాగ్వాదానికి దిగితే మీకే నష్టం జరుగుతుంది. ఈ టైంలో మీరు సహణంగా లేకుంటే.. ఆఫీస్ లో తోటి ఉద్యోగులతో స్నేహ సంబంధాలు చెడిపోయే ఛాన్స్ ఉంటుంది.ఇంట్లో కూడా ఏదైనా ఇష్యు జరిగినప్పుడు.. ఆలోచించకుండా తొందరపాటుతో సలహాలు ఇవ్వొద్దు.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ టైంలో ఖర్చులు విపరీతంగా పెరిగి, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే మీ ఖర్చులను నియంత్రణ లో పెట్టుకోండి. ఈ రాశి వాళ్ళ జీవిత భాగస్వామి కి ఈ టైంలో అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ముప్పు ఉంటుంది.

శుక్రుడు సింహరాశిలో..

ఈ సమయంలో శుక్రుడు సింహరాశిలో ఉంటాడు. శుక్రుడు ఆనందం, వైభవం, ఐశ్వర్యం, శ్రేయస్సుకు కారకంగా పరిగణిస్తారు. శుక్రుడు సెప్టెంబర్ 15న 2.29కి సింహరాశిలో అస్తమిస్తాడు. బుధుడు ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు. అందువలన బుధుడు, శుక్రుడు సింహరాశిలో ఉంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 7 zodiac signs
  • devotional
  • september 12 and zodiac signs
  • zodiac signs

Related News

Magha Masam

మాఘ మాసం ఎప్పుడు వస్తోంది.. విశిష్టత ఏంటి

Magha Masam మాఘమాసం ప్రతియేటా సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య వస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్‌ ప్రకారం 11వ నెల. ఇది ఉత్తరాయణంలో వస్తుంది. ఈ మాఘమాసాన్ని ఎంతో విశిష్టమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాఘమాసంలో ఆచరించే నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మాఘమాసం 2026 ప్రారంభతేదీ, ముగింపు తేదీ మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం.

  • Mauni Amavasya

    మౌని అమావాస్య నాడు ఇలా చేస్తే.. హర్ష యోగం ప్రాప్తిస్తుంది

Latest News

  • అస్సాం లో మోడీ పర్యటన, 10వేల మందితో ‘బాగురుంబా నృత్యం’

  • మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి – బండి సంజయ్

  • USAలో నవీన్ హవా, వన్ మిలియన్ డాలర్స్ తో హ్యాట్రిక్

  • యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

  • దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర ఈరోజు నుండి ప్రారంభం

Trending News

    • ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌!

    • ఐసీసీ అధికారి వీసా తిర‌స్క‌రించిన బంగ్లాదేశ్‌!

    • ఇక‌పై వారం రోజుల‌కొక‌సారి సిబిల్ స్కోర్ చూసుకోవచ్చు!

    • రేపే న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. టీమిండియా గెల‌వ‌గ‌ల‌దా?!

    • ఉజ్జయినిలోని బాబా మహాకాల్‌ను దర్శించుకున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd