TTD: టీటీడీ కీలక నిర్ణయం, తిరుమలకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు
- By Balu J Published Date - 05:27 PM, Tue - 12 March 24

TTD: సుదూరప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు 479 మంది నర్సు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.దీనిపై పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. టీటీడీ పరిధిలోని పాఠశాల, కళాశాలల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవస్థానాల అభివృద్దికి పై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. టీటీడీ ఐటీ సేవల కోసం టెక్ రీప్లేస్మెంట్ నిర్మహణకై 12 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
కాగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లు తమ కళ్యాణానికి విచ్చేసిన ముక్కోటి భక్తజన కోటికి మునులకు ఋషులకు వీడ్కోలు పలుకుతూ గిరిప్రదక్షిణ చేశారు. ఉదయం అలంకార మండపంలో పార్వతీపరమేశ్వరులు ప్రత్యేక అలంకరణలో గిరిప్రదక్షిణ కి బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణ నాలుగు మాడవీధుల్లో భక్తజన కోటికి దర్శనమిస్తూ గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఏడాదిలో రెండుసార్లు స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తుంది మొదటిది సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తారు.