VIral Video: నడిరోడ్డుపై మహిళలకు బలవంతంగా కొవిడ్ పరీక్షలు!
పీపీఈ సూట్ లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు నడి రోడ్డుపై ఓ మహిళను అడ్డుకున్నారు.
- Author : Hashtag U
Date : 05-05-2022 - 3:57 IST
Published By : Hashtagu Telugu Desk
పీపీఈ సూట్ లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు నడి రోడ్డుపై ఓ మహిళను అడ్డుకున్నారు. ఇప్పటికిప్పుడు కరోనా టెస్టు చేయించుకోలేను అని చెప్పిన ఆమె పై బల ప్రయోగం చేశారు. ఇద్దరు పురుష ఆరోగ్య కార్యకర్తలు కలిసి .. ఆ మహిళను అణగబట్టి నోటి నుంచి శాంపిళ్లు సేకరించారు. ఇలాంటి దృశ్యాలు చైనా లోని షాంఘై లో సర్వ సాధారణంగా మారాయి. ఆ నగరంలోని ప్రజలకు బలవంతంగా కరోనా పరీక్షలు చేస్తున్నారు. మహిళలు, టీనేజర్ల నుంచి వృద్ధుల దాకా ఎవర్నీ విడిచిపెట్టడం లేదు.
కరోనాను కట్టడి చేసే క్రమంలో ప్రజలకు మూడోరౌండ్ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా, చైనాలోనే అత్యధిక కేసులు షాంఘైలో నమోదవుతున్నాయి.
The woman was forced to do COVID-test in China. https://t.co/2E5Ba0nf15
— Dr. Ware Fong (@WeisheJiang) April 29, 2022