New Covid : మళ్లీ దూసుకొస్తోన్న కరోనా, చైనాలో 10లక్షల మరణాల అంచనా
చైనాలో కరోనా(New Covid) మళ్లీ విజృంభిస్తోంది. ఆంక్షలు ఎత్తివేయడంతో కేసులు పెరిగాయి.
- Author : CS Rao
Date : 20-12-2022 - 5:27 IST
Published By : Hashtagu Telugu Desk
చైనా దేశంలో కరోనా(New Covid) మళ్లీ విజృంభిస్తోంది. ఆంక్షలు ఎత్తివేయడంతో ఒక్కసారి కేసులు అనూహ్యంగా పెరిగాయి. తాజాగా 3,83,175 కేసులను ఆ దేశం నిర్థారించింది. రాబోవు రోజుల్లో కోవిడ్ మరణాలు 10లక్షల వరకు చేరవచ్చని వేస్తోంది. ఒక్క రోజులోనే అధికారిక మరణాల(Deaths) సంఖ్య 5,242కి పెరిగింది. కొత్త మరణాలు డిసెంబర్ 3 నుండి నేషనల్ హెల్త్ కమీషన్ (NHC) నివేదించింది. చైనాలో 2,722 కొత్త సింప్టోమాటిక్ కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదు కావడం జరిగింది. చైనా 2,656 కొత్త స్థానిక కేసులను(New Covid) నివేదించింది.
సోమవారం నాటికి చైనా 3,83,175 కోవిడ్ కేసులను లక్షణాలతో నిర్ధారించింది. కఠినమైన యాంటీ-వైరస్ నియంత్రణలను సడలించిన తర్వాత నగరాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రాబోయే నెలల్లో కోవిడ్-19 కేసుల మరణాలు(Deaths) పెరుగుతాయని భావిస్తున్నారు. చైనా యొక్క చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వు జున్యు గత వారం మాట్లాడుతూ, ఈ శీతాకాలంలో మూడు కోవిడ్ -19 వేరియెంట్స్ వచ్చాయని అన్నారు. రాజధానిలో వైరస్ వేగంగా వ్యాపిస్తోందని బీజింగ్ నగర అధికారి జు హెజియాన్ సోమవారం ప్రకటించారు. అయినప్పటికీ, బార్‌ల నుండి ఇంటర్నెట్ కేఫ్‌ల వరకు భూగర్భంలో ఉన్న వాటితో సహా ఆంక్షలు ఎత్తివేపినట్టు బీజింగ్ నగర అధికారి జు హెజియాన్ చెప్పారు.
చైనా దేశంలో కరోనా(New Covid)
ఇటీవలి వారాల్లో వైరస్ ఓమిక్రాన్ వల్ల కలిగే ముప్పును ఉన్నతాధికారులు తక్కువగా అంచనా వేస్తున్నప్పటికీ, టీకాలు వేసుకోని వృద్ధుల గురించి అధికారులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ -19 మరణాల సంఖ్య రాబోయే రోజుల్లో 10 లక్షలకు పైగా పెరుగుతుందని కొందరు భయపడుతున్నారు. కోవిడ్ -19 నియంత్రణలను చైనా ఎత్తివేయడం వల్ల కేసులు పెరుగుతున్నందున 10 లక్షల మందికి పైగా మరణాలు సంభవించవచ్చని అంచనా వేస్తున్నారు.
US-ఆధారిత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) కూడా చైనాలోని కోవిడ్ -19 నియంత్రణలను ఎత్తివేయడంపై ఆందోళన చెందుతోంది. వచ్చే ఏడాది కేసులు ఎక్కువగా ఉంటాయని 10 లక్షలకు పైగా మరణాలు సంభవించవచ్చిన అమెరికా అంచనా వేసింది.
చైనాలో కరోనావైరస్ కేసులు ఏప్రిల్ 1, 2023 నాటికి గరిష్ట స్థాయిలో మరణాలు 3,22,000 ఉంటాయని అంచనా వేస్తున్నారు. అప్పటికి చైనా జనాభాలో మూడింట ఒకవంతు మందికి వ్యాధి సోకుతుందని ఐహెచ్‌ఎంఈ డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే తెలిపారు. గతంలోనూ చైనా నుంచి కరోనా వేరియెంట్స్ వ్యాప్తి చెందిన విషయం విదితమే. ఇప్పుడు చైనా దేశంలో ఆంక్షలు ఎత్తివేశారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. దీంతో అత్యధికంగా కరోనా కేసులు వ్యాప్తి చెంతున్నప్పటికీ ప్రభుత్వం పెద్దగా రియాక్ట్ కావడంలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలను ప్రారంభించింది. జిరో కోవిడ్ ఆలోచన నుంచి బయటపడింది. ఫలితంగా 10లక్షల మరణాలు సంభవించేలా కరోనా విజృంభణ ఉంటుందని చెబుతున్నారు.
Also Read : Covid like virus BtSY2: కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్..మానవుల్లో వ్యాపిస్తే వినాశనమే..!!
ప్రపంచ వ్యాప్తంగా చైనా దేశంలోని పరిస్థితులను గమనిస్తున్నారు. తొలి రోజుల్లో లాక్ డౌన్ పెట్టడం ద్వారా చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు. ఇప్పటి వరకు కోట్లాది మంది చనిపోయినప్పటికీ అధికారిక లెక్కలను ఆ దేశం బయటపెట్టలేదని డబ్ల్యూహెచ్ వో అనుమానిస్తోది. పైగా ఆ దేశం నుంచి కరోనా వచ్చిందని విశ్వసించడానికి అనువైన నివేదికలు బయటకు వస్తున్నాయి.