HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Coronavirus News
  • >China Locks Down Thousands Expects New Covid Outbreak To Worsen In Coming Days

Corona: భార‌త్‌.. బీ ఎల‌ర్ట్‌.. చైనాలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు..

బీజింగ్: మ‌నం మ‌ళ్లీ అల‌ర్ట‌వ్వాల్సిన టైమ్ వ‌చ్చేసిందా? థ‌ర్డ్ వేవ్ పంజా విస‌ర‌డానికి రెడీ అవుతోందా అంటే అవున‌నే అనిపిస్తోంది. రెండేళ్ల పాటు యావ‌త్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసిన క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ చైనాలో విజృంభిస్తోంద‌ట‌.. కొద్దిగా త‌గ్గింద‌నేకునేలోపే చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంద‌నే హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయి.

  • Author : Hashtag U Date : 25-10-2021 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

రికార్డు స్ధాయిలో వ్యాక్సినేష‌న్ చేసినా కూడా చైనాలో క‌రోనా కేసులు రానురాను పెరిగిపోతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన డెల్టా వేరియంట్ తాజా వ్యాప్తికి కారణమని, రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరుగుతాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్ 17 నుంచి వారం వ్యవధిలో 11 ప్రావిన్సులకు కరోనావైరస్ వ్యాపించిందని నేషనల్ హెల్త్‌ కమిషన్ మి ఫెంగ్ వెల్లడించారు. వైరస్ బారిన పడిన వ్యక్తుల్లో చాలా మంది ఇతర ప్రాంతాలకు పర్యటించినట్లు తేలిందన్నారు. దాంతో ప్రభావిత ప్రాంతాలు కఠిన నిబంధనలు అవలంబించాలని సూచించారు. గన్సు, ఇన్నర్ మంగోలియాలోని కొన్ని నగరాలు బస్సు, ట్యాక్సీ సేవల్ని నిలిపివేశాయని రవాణా శాఖకు చెందిన అధికారి వెల్లడించారు. ఈ సోమవారం నుంచి ప్రజలు, పర్యాటకులు ఇళ్లకే పరిమితం కావాలని ఇన్నర్ మంగోలియాలోని ఎజినా అధికారయంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉపేక్షిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది.

శనివారం చైనాలో 26 కొత్త కేసులు వెలుగుచూశాయి. అందులో ఏడు ఇన్నర్ మంగోలియా, ఆరు గన్సు, ఆరు నింగ్జియాలో నమోదు కాగా, బీజింగ్ నాలుగు కేసులు వెలుగుచూశాయి. హబే, హునాన్, షాంగ్జిలో చెరో ఒక కేసు బయటపడింది. వైరస్ కారణంగా అక్టోబర్ 31న జరగాల్సిన మారథాన్‌ను బీజింగ్ ప్రభుత్వం రద్దు చేసింది. వైరస్ కేసులు వెలుగుచూసిన ప్రాంతాల ప్రజలు దేశ రాజధానిలో ప్రవేశించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనం పేర్కొంది.

తాజాగా డెల్టా వ్యాప్తి.. ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవాలనే పలు ఆసియా దేశాలకు ఆటంకంగా మారుతోంది. గత 270 రోజుల్లో పూర్తి వ్యాక్సినేషన్ లేక కొవిడ్ నుంచి కోలుకున్న ఉద్యోగులు జనవరి ఒకటి నుంచి కార్యాలయాలకు రావొచ్చంటూ సింగపూర్ శనివారం ప్రకటించింది. అక్కడ ఇప్పటికే 84 శాతం మంది పూర్తి టీకాలు పొందినప్పటికీ.. కేసులు పెరుగుతుండటంతో మరో నెల రోజుల పాటు అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను పొడిగించింది.

చైనాలో ఇప్పటివరకు 96,797 కరోనా కేసులు..4,636 మరణాలు సంభవించాయని వరల్డో మీటర్ గణాంకాలు వెల్లడించాయి. టీకా పంపిణీ విషయంలో ఆ దేశం అగ్రస్థానంలో ఉంది. అక్కడ ఇప్పటివరకు దాదాపు 105 కోట్ల మంది పూర్తి స్థాయి టీకా పొందారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • corona
  • delta variant
  • third wave

Related News

20 US States On Alert As Venomous Chinese Ant

Chinese Ant: అమెరికాలో చైనా చీమలు కుడితే ప్రాణాపాయం..

అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న చైనాకు చెందిన ‘ఏషియన్ నీడిల్ ఆంట్’ అనే ప్రమాదకరమైన చీమల జాతి గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనా మూలాలు కలిగిన ఈ ‘ఏషియన్ నీడిల్ ఆంట్స్’ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా సుమారు 20 రాష్ట్రాలకు విస్తరించాయి. ఐదో వంతు అంగుళం పరిమాణంలో, ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండే ఈ

    Latest News

    • Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన

    • హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ

    • Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

    • Gold Imports: బంగారం,వెండి పై సుంకాలు రెట్టింపు చేసిన కేంద్రం…

    • Mouni Roy: విడాకులు తీసుకోబోతున్న మౌనీ రాయ్?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd