Youtuber: ఖరీదైన కారు కొన్న జీపీ ముత్తు
సోషల్ మీడియా ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా టిక్ టాక్ వచ్చాక ఎందరో తమ టాలెంట్ ని బయటపెట్టి స్టార్స్ గా మారారు
- By Praveen Aluthuru Published Date - 04:09 PM, Sun - 10 September 23

Youtuber: సోషల్ మీడియా ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా టిక్ టాక్ వచ్చాక ఎందరో తమ టాలెంట్ ని బయటపెట్టి స్టార్స్ గా మారారు. అలా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువైన వారిలో జీపీ ముత్తు ఒకరు. ఇతను యూట్యూబ్‌ని ప్రారంభించి సక్సెస్ అయ్యాడు. రోజు వీడియోలు చేయడం ద్వారా స్వల్ప వ్యవధిలోనే యూజర్స్ కి కనెక్ట్ అయ్యాడు. దీంతో లక్షలాది మంది అతన్ని ఫాలో అవ్వడం ప్రారంభించారు. టీవీ షో, బిగ్ బాస్‌లో కూడా అవకాశం దక్కించుకున్నాడు.తాజాగా ముత్తు కార్ కొన్నాడు. ఈ సందర్భంగా ముత్తు మాట్లాడుతూ.. మా కుటుంబంలో కారు కొన్న మొదటి వ్యక్తి నేనేనని చాలా గర్వంగా చెప్పాడు. అంతకుముందు 2021లో సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. తాజాగా అతను కొత్త కియా కారును కొనుగోలు చేసిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు… కియా కారు ధర 12 నుండి 15 లక్షల మధ్య అమ్ముడవుతున్నట్లు నివేదికలు ఉన్నాయి.
Also Read: Jagan Political Depression: పొలిటికల్ డిప్రెషన్ లో జగన్..!