Yatra 2 : ప్రజలను దగ్గరుండి యాత్ర 2 కు తీసుకెళ్తున్న వైసీపీ శ్రేణులు ..?
- Author : Sudheer
Date : 08-02-2024 - 8:02 IST
Published By : Hashtagu Telugu Desk
ఐదేళ్ల క్రితం సరిగ్గా ఎన్నికల సమయంలో మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర (Yatra) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కటి విజయం సాధించింది. 2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా ప్రభావం అప్పట్లో జనాలపై బాగా పడింది. ఇక ఇప్పుడు సరిగ్గా మళ్లీ ఎన్నికల సమయంలో యాత్ర 2 (Yatra 2)ను తీసుకొచ్చారు. ఈరోజు ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను చూసేందుకు వైస్సార్ అభిమానులు పోటీ పడుతుండగా..వైసీపీ నేతలు సైతం ఈ సినిమాను ప్రజలకు చూపేంచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వాహనాలను పెట్టి , టికెట్స్ కొనుగోలు చేసి మరి ప్రజలను సినిమాకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క సోషల్ మీడియా లోను సినిమా గురించి బాగా ప్రచారం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క యాత్ర-2 సినిమా విడుదల అవుతోందని చెప్పి జగన్ రెడ్డి కోరిక మేరకు స్పీకర్ సభను వాయిదా వేశారని టిడిపి నేతలు ఆరోపించారు. శాసనసభ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారని, కానీ 9.15 గంటల వరకు సభలో కోరం లేకపోవడంతో సభను వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి 11 గంటల వరకు సభను సమావేశపరచలేదని వెల్లడించారు. అందుకే టీడీపీ శాసనసభా పక్షం ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిందని, సభ్యులందరం బయటికి వచ్చేశామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
అంతే కాదు నిన్న రాత్రే సీఎం జగన్ ..వైసీపీ ఎమ్మెల్యేలకు యాత్ర 2 ను చూపించారని అంటున్నారు. విజయవాడలోని కళా నగర్ ఏరియాలో కల ట్రెండ్ సెట్ మాల్లోని కాపిటల్ సినిమాస్ స్క్రీన్లలో ‘యాత్ర 2’ స్పెషల్ షోలు వేసారట. సీఎం మినహా.. 150 మంది ఎమ్మెల్యేల్లో ఈ సినిమాను చూసేందుకు 60 మంది మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికి యాత్ర 2 ప్రభావం మాత్రం ప్రజల ఫై పడుతుందని వైసీపీ గట్టిగా నమ్ముతుంది.
Read Also : AP : ప్లాన్ బీని తెరమీదికి తెస్తే.. వైసీపీ వాళ్లుఎవ్వరూ మిగలరు – నాగబాబు