AP : ప్లాన్ బీని తెరమీదికి తెస్తే.. వైసీపీ వాళ్లుఎవ్వరూ మిగలరు – నాగబాబు
- Author : Sudheer
Date : 08-02-2024 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ(AP)లో రాజకీయాలు (Politics) రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఓ పక్క పొత్తుల వ్యవహారం..సీట్ల సర్దుబాటు..అభ్యర్థుల ఎంపిక..అసమ్మతి నేతలను బుజ్జగించడం ఇలా ఇవన్నీ చూసుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈసారి కూడా 2014 కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) కు ఢిల్లీ బిజెపి పెద్దలనుండి ఆహ్వానం అందడం, బీజేపీ తో పొత్తు , సీట్ల సర్దుబాటు వంటివి చర్చలు జరగడం ఇవన్నీ ఆయా పార్టీల శ్రేణుల్లో సంతోషం నింపుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో జనసేన నేత, మెగా బ్రదర్ (Nagababu) ప్రస్తుతం విశాఖ టూర్ లో బిజీ గా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం తథ్యమని.. రాసి పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. వైసీపీని ఓడించేందుకు ఇప్పుడున్న వాటి కంటే.. కూడా వేరేగా ప్లాన్-బి ఉందని..ఆ ప్లాన్ తెరమీదికి తెస్తే.. వైసీపీ వాళ్లుఎవ్వరూ మిగలరు” అని అన్నారు. “వైసీపీ విడుదల చేస్తున్న జాబితాలు చిత్తు కాయితాలుగా ఉన్నాయి. ఒక్కడు కూడా పనికొచ్చే నాయకుడు లేడు. వైసీపీ ఏడో జాబితా కాదు… లక్ష జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదు” అని వ్యాఖ్యానించారు.
ప్రజలకు న్యాయం చేయలేని వైసీపీ ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడినా ఒకటేనని అన్నారు. ‘విశాఖపట్నం చుట్టు పక్కల రూ.వందల కోట్ల విలువ చేసే భూములు దోచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ వైరస్ సర్వనాశనం చేసింది. కలిసికట్టుగా పనిచేస్తేనే వైరసు అంతం చేయగలం. అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి టీడీపీ, జనసేన పరస్పరం సహకరించుకొని YCPని గద్దె దించాలి’ అని వ్యాఖ్యానించారు.
Read Also : Telangana: అసెంబ్లీలో కేసీఆర్‌కు పెద్ద ఛాంబర్ కేటాయించండి ప్లీజ్: బీఆర్ఎస్