Yatra 2 : 2024 ఎలక్షన్స్ టార్గెట్.. జగన్ బయోపిక్ ‘యాత్ర 2’ రెడీ అంటున్న డైరెక్టర్..
దర్శకుడు మహి v రాఘవ్ పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా యాత్ర 2 గురించి కూడా మాట్లాడాడు. గతంలోనే యాత్ర 2 సినిమా ఉంటుందని ప్రకటించినా అది ఎప్పుడు ఉంటుంది, కథ ఏం ఉంటుంది అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
- Author : News Desk
Date : 09-05-2023 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
పలు చిన్న సినిమాలతో మెప్పించిన దర్శకుడు మహి v రాఘవ్(Mahi V Raghav) 2019 ఎలక్షన్ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర(Yatra) అనే సినిమాను రాజశేఖర్ రెడ్డి బయోపిక్(Biopic) గా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాక జగన్ గెలవడంలో ఎంతో కొంత సహాయం చేసింది కూడా. దీంతో ఈ దర్శకుడు మహి v రాఘవ్ కు మంచి పేరు వచ్చింది.
ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు ఈ దర్శకుడు. ఇటీవలే సేవ్ ది టైగెర్స్ అనే ఓ కామెడీ సిరీస్ తో ప్రేక్షకులని పలకరించాడు. ఈ సిరీస్ కూడా మంచి విజయం సాధించింది. సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా యాత్ర 2 గురించి కూడా మాట్లాడాడు. గతంలోనే యాత్ర 2 సినిమా ఉంటుందని ప్రకటించినా అది ఎప్పుడు ఉంటుంది, కథ ఏం ఉంటుంది అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
తాజాగా మహి v రాఘవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యాత్ర 2 సినిమా ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ కి వెళ్తుంది. జగన్ గారు పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఎలా CM అయ్యారు అనే కథతో యాత్ర 2 ఉంటుంది అని తెలిపారు. అయితే ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో తీయడానికి కారణమేంటి దీంతో మరోసారి జగన్ ని గెలిపిస్తారా అని అడగగా.. సినిమా చూసి ఓట్లు పడతాయి అనుకుంటే యాత్ర సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది. అలా అనుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మిగిలిన నాయకులు కూడా తమ బయోపిక్ లు తీసుకుంటారు కదా అని అన్నాడు. దీంతో మహి v రాఘవ్ వ్యాఖ్యలు ఏపీలో చర్చగా మారాయి. మొత్తానికి మరోసారి 2024 ఎలక్షన్స్ టార్గెట్ గా యాత్ర 2 రాబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read : Sobhita Dhuipala : నేనేం తప్పు చేయలేదు.. నాగ చైతన్యతో డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శోభిత..