Sobhita Dhuipala : నేనేం తప్పు చేయలేదు.. నాగ చైతన్యతో డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శోభిత..
చైతన్య, శోభిత ఇప్పటివరకు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ విదేశాల్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, విదేశాల్లో తిరుగుతున్నారని వార్తలు వచ్చాయి.
- By News Desk Published Date - 07:05 PM, Tue - 9 May 23

నాగ చైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) విడిపోయాక వారిద్దరి మీద రోజూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. సమంత మీద వచ్చే కొన్ని రూమర్స్ కి సమంత సోషల్ మీడియా(Social Media) వేదికగా అప్పుడప్పుడు కౌంటర్లు ఇస్తుంది. కానీ చైతూపై వచ్చే రూమర్స్ కి మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. కొన్ని రోజుల క్రితం నాగ చైతన్య, హీరోయిన్ శోభిత(Sobhita) డేటింగ్ లో ఉన్నారని, విదేశాల్లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని వార్తలు వచ్చాయి.
చైతన్య, శోభిత ఇప్పటివరకు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ విదేశాల్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. అలాగే ఓ ప్రముఖ చెఫ్ తో చైతూ ఫోటో దిగగా అందులో శోభిత కూడా ఉండటంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, విదేశాల్లో తిరుగుతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించకపోవడంతో పలువురు ఈ డేటింగ్ వార్తలు నిజమే అనుకున్నారు. కానీ తాజాగా శోభిత దీనిపై స్పందించింది.
శోభిత హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ కి రాగా మీడియాతో మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి చైతూ గురించి ఇండైరెక్ట్ గా అడుగుతూ.. ఇటీవల మీ మీద ఒక రూమర్ బాగా వినిపిస్తుంది కదా దానికి సమాధానం ఇస్తారా అని అడిగారు. దీనికి శోభిత సమాధానమిస్తూ.. నేను ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాను. సినిమాలు చేస్తూ బిజీగా ఉంటే ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఎవరో ఏదో అన్నంతమాత్రాన నేను వాటిని పట్టించుకోనవసరం లేదు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. రూమర్స్ కి క్లారిటీ ఇవ్వడానికి నేనేమి తప్పు చేయలేదు. అలాంటప్పుడు అసలు వాటి గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పింది. దీంతో ఇండైరెక్ట్ గా చైతూతో డేటింగ్ అంటూ వచ్చే రూమర్స్ పై అలాంటిదేమి లేదు అని క్లారిటీ ఇచ్చేసిందా అని అనుకుంటున్నారు.
Also Read : Tabu-Nag Dating: టబుతో డేటింగ్ రూమర్స్.. కింగ్ నాగార్జున రియాక్షన్ ఇదే
Related News

Samantha: షూటింగ్స్ కు విరామం.. తల్లితో కలిసి సమంత డిన్నర్ డేట్
వరుస సినిమా షూటింగ్స్ బిజీగా ఉన్న సమంత కాస్తా బ్రేక్ తీసుకొని తన తల్లితో ఆనందంగా గడుపుతోంది.