WOLF Teaser : అనసూయ తాంత్రిక విద్య నేర్చుకుందా..? చూస్తే అలాగే అనిపిస్తుంది
కాషాయం రంగు దుస్తులు ధరించి ఓ సాధువులా కనిపిస్తుంది
- Author : Sudheer
Date : 05-08-2023 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
అదేంటి అనసూయ (Anasuya ) తాంత్రిక విద్య నేర్చుకోవడం అనుకుంటున్నారా..? అనసూయ లో చాల యాంగిల్స్ ఉన్నాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా , నటిగా , సోషల్ మీడియా లో సెగలు రేపే హాట్ బ్యూటీగా ఇలా చాల కోణాలు అమ్మడిలో ఉన్నాయి. అందుకే ఏ ఫ్లాట్ ఫామ్ కు ఆ అభిమానులు ఉన్నారు. వారందర్ని అలరింపజేసేందుకు అన్ని యాంగిల్స్ ను ట్రై చేస్తుంటుంది. రంగస్థలంలో రంగమ్మత్త గా ..క్షణం మూవీ లో ACP జయ భరద్వాజ్ వంటి పవర్ ఫుల్ ఆఫీసర్ గా..లేటెస్ట్ గా విమానంలో సుమతి వంటి వ్యభిచారి రోల్ లో ఇలా ఎప్పటికప్పుడు తనలోని టాలెంట్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఇప్పుడు సాధువులా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభుదేవా హీరోగా వినూ వెంకటేష్ (Vinoo Venketesh) డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ వూల్ఫ్ (Wolf Movie). ఈ సినిమాకు సందేష్ నాగరాజు, సందేష్ ఎన్ నిర్మాతలుగా, బృందా జయరామ్ సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రభుదేవా (Prabhu Deva) 60 వ మూవీ గా ఇది తెరకెక్కడం విశేషం. ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.
ఈ టీజర్ అంత కూడా మంత్ర, తాంత్రిక శక్తులతో నింపేశారు. ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్, అనసూయ గెటప్ సినిమా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి పెంచేస్తుంది. ఇక టీజర్ లో అనసూయ కాషాయం రంగు దుస్తులు ధరించి ఓ సాధువులా కనిపిస్తుంది. అయితే ఆమె ముందు ఓ శవం ఉండటం ..ఆమె ఏదో మంత్రాలు చదువుతూ కనిపిస్తుండడం తో సినిమాలో ఆమె ఏదో తాంత్రిక విద్య తెలిసిన మహిళ పాత్ర చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంతే కొన్ని రొమాంటిక్ సీన్లులలో అనసూయ రెచ్చిపోయినట్లు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ టీజర్ తో మరోసారి అను గురించి అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా పలు భాషల్లో సినిమా రిలీజ్ కాబోతుంది.
Read Also : Vizag Airport Suspended : విశాఖ విమానాశ్రయం మూసివేతపై పురంధరేశ్వరి ఫైట్