Where is Saif: రావణుడు ఎక్కడ? ఆదిపురుష్ ప్రమోషన్లకు ‘సైఫ్’ డుమ్మా, అసలు కారణమిదే!
ఆదిపురుష్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. సైఫ్ అలీ ఖాన్ ప్రమోషన్లకు దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారుతోంది.
- By Balu J Published Date - 03:57 PM, Sat - 10 June 23
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీలో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషిస్తున్నాడు. అయితే, ట్రైలర్, పాటల లాంచ్‌లతో సహా ఏ ప్రచార కార్యక్రమాలలోనూ సైఫ్ కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. కేవలం హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్ మాత్రమే సందడి చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లోనే కాకుండా పలు ట్రైలర్లలో కూడా సైఫ్ లేకపోవడంపై ఆయన అభిమానులు ఒకింత నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ఆదిపురుష్ టీజర్ సమయంలోనే సైఫ్ పాత్రపై అనేక విమర్శలు వచ్చాయి. ఆయన రావణుడిలా లేడని, మహ్మద్ ఖిల్జీలా, బిన్ లాడెన్ లా ఉన్నాడంటూ ఆయన లుక్స్ పై నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. అయితే విమర్శల నుంచి తప్పించుకోవడానికి సైఫ్ ప్రమోషన్లలో పాల్గొనడం లేదని సమాచారం. “బహుశా సైఫ్ అలీ ఖాన్ అబద్ధం చెప్పలేడు, ప్రమోషన్ల పట్ల ఆసక్తి చూపలేడు అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మీడియా రిపోర్టర్ల నుంచి ఆధ్యాత్మిక వేత్తల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సైఫ్ సమాధానం చెప్పలేకపోవచ్చనే కారణం కూడా వినిపిస్తోంది.
ఆదిపురుష్ ప్రిరిలీజ్ ఈవెంట్ లో తమ తమ ప్రసంగాల్లో హీరోతో పాటు చాలామంది నటీనటులు ‘జైశ్రీరామ్’ అని నినాదాలు చేశారు. సైఫ్ అలా అనకపోవచ్చు. ఇది మరింత వివాదానికి దారితీస్తుంది చిత్ర యూనిట్ భావన. ఆదిపురుష్‌లో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, బజరంగ్గా దేవదత్తా నాగే, మేఘనాధగా వత్సల్ షేత్, సోనాల్ చౌహాన్ నటించారు. ఇది భారీ బడ్జెట్ చిత్రం, విఎఫ్ఎక్స్తో కూడిన భారీ చిత్రం. జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు సైఫ్ “రాక్షస రాజుగా నటించడం చాలా ఆసక్తికరంగా ఉంది’ అని రియాక్ట్ అయ్యాడు.
Also Read: Murder Case: అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణ రిమాండ్
Related News
Swayambhu: నిఖిల్ సినిమాలో ఒక్క ఎపిసోడ్ కోసం 8 కోట్లు ఖర్చు
Swayambhu: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం చిత్రబృందం ప్రముఖ తారాగణంతో ఓ ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తోంది. వియత్నాం ఫైటర్స్ సహా 700 మంది ఆర్టిస్టులతో 12 రోజుల పాటు చిత్రీకరించనున్న ఈ ఎపిసోడ్లో నిఖిల్ కొన్ని అద్భుతమై�