NTR Devara Event Guest : ఎన్టీఆర్ దేవరకు అతిథిగా ఎవరు..?
NTR Devara Event Guest కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమా మొదటి భాగం ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
- Author : Ramesh
Date : 09-09-2024 - 1:02 IST
Published By : Hashtagu Telugu Desk
NTR Devara Event Guest RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరతో మాన్ ఆఫ్ మాసెస్ గా మారిపోయాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమా మొదటి భాగం ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరిని ఆహ్వానిస్తారా అన్న చర్చ మొదలైంది. ఐతే సోషల్ మీడియాలో దేవర కోసం సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా వస్తారని అంటుండగా కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేవర కోసం గెస్ట్ గా వస్తాడని చెబుతున్నారు.
మహేష్, అల్లు అర్జున్ ఇద్దరిలో ఒకరు..
మహేష్, అల్లు అర్జున్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు దేవర ఈవెంట్ కి అటెండ్ అవుతారని అంటున్నారు. దేవర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ తెస్తుంది. ఎన్టీఆర్ మాస్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేసేలా దేవర రాబోతుంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
దేవర సినిమా లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది. సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కొరటాల శివ జాగ్రత్త పడుతున్నారు. అంతకుముందు మహేష్ భరత్ అనే నేను కోసం ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చాడు. ఇప్పుడు మళ్లీ అదే కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ దేవర కోసం మహేష్ వస్తాడని చెబుతున్నారు. గెస్ట్ ఎవరన్నది మరికొద్దిరోజుల్లో ఫైనల్ అవుతుంది.
Also Read : BiggBoss 8 Telugu : బై బై బేబక్క.. బిగ్ బాస్ 8 అసలు ఆట మొదలు..!