Varanasi Movie : వారణాసి మూవీ గ్లింప్స్‌లో భయంకరంగా కనిపించే ఆ దేవత ఎవరు?
- By Vamsi Chowdary Korata Published Date - 12:08 PM, Fri - 5 December 25
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi Movie) కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అప్పటి నుంచి ఓ ఫోటోపై విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ ఫోటో విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల రాజమౌళి – మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ లాంచ్ జరిగిన విషయం తెలిసిందే. టైటిల్ రిలీజ్ సమయంలో విడుదల చేసిన గ్లింప్స్‌లో బాగా గమనిస్తే ఒక ఫోటోపై ప్రస్తుతం బాగా చర్చ జరుగుతోంది. అదేమిటంటే.. సముద్ర గర్భంలో ఒక దేవత తన తల తానే చేధించుకుని.. ఒక చేతిలో ఖడ్గంతో మరో చేతిలో తన తలతో ఉండి.. ఆమె మొండెం నుంచి మూడు రక్తధారలు పడుతూ చూడటానికి భయంకరంగా ఉండే ఆ ఫోటో మాత్రం అందరిలో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆ ఫోటోలో ఉన్న దేవత ఎవరు.. ఆమె కథ ఏంటో తెలుసుకుందాం..