Where is Sai Pallavi: కనిపించని సాయిపల్లవి.. అయోమయంలో ఫ్యాన్స్!
టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒకింత నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
- Author : Balu J
Date : 12-12-2022 - 5:43 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ (Tollywood) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో, అంతే క్రేజ్ ఫిదా బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi)కి ఉంది. అందుకే ఆమెను ఫ్యాన్స్ లేడీ పవన్ కళ్యాన్ అని కూడా అంటారు. కానీ సడన్ గా ఈ బ్యూటీ ఎక్కడా కనిపించకుండాపోయింది. సాయిపల్లవి ఒక కథను ఒప్పుకుందంటే కంటెంట్ లో కొత్తదనం ఏదో ఉందనే నమ్మకం ఆడియన్స్ కి కలిగింది. ఆమె నటనతో పాటు డాన్స్ కూడా వాళ్లను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.
ఇక వ్యక్తిత్వం పరంగా కూడా ఆమె తెలుగువారిని ఆకట్టుకుంది. సాయిపల్లవి (Saipallavi) ఉంటే చాలు .. ఆ సినిమా చూడొచ్చునని ఫ్యామిలీ ఆడియన్స్ ఫిక్స్ అయ్యేలా ఆమె నమ్మకాన్ని సంపాదించుకోగలిగింది. అలాంటి సాయిపల్లవి (Sai Pallavi) పేరు ‘శ్యామ్ సింగ రాయ్’ తరువాత ఏ ప్రాజెక్టులోను వినిపించడం లేదు .. కనిపించడం లేదు. ఆ తరువాతనే ‘విరాటపర్వం’ వచ్చినా, రిలీజ్ విషయంలో లేట్ కారణంగా, తెలుగులో ఆమె చివరి సినిమాగా కనిపిస్తోంది.
సాయిపల్లవికి తగిన కథలు రావడం లేదా? లేదంటే తెలుగు సినిమాలు చేసేంత తీరిక ఆమెకి లేదా? కొత్త ఏడాదిలోనైనా ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేనా? అనే ప్రశ్నలే ఇక్కడ అందరినీ వేధిస్తున్నాయి.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తున్నా సాయిపల్లవి (Sai Pallavi) కొత్త సినిమాలను అంగీకరించపోవడంతో ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Janvi Kapoor Fitness : ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టిన జాన్వీ