Nayanthara : నయనతార నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ఏమేం చెప్పారు? ఏమేం చూపించారు?
నయనతార డాక్యుమెంటరీ నిన్నటి నుంచే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
- By News Desk Published Date - 07:41 AM, Tue - 19 November 24

Nayanthara : నయనతార లైఫ్ పై నెట్ ఫ్లిక్స్(Netflix) ఓ డాక్యుమెంటరీ నిర్మించింది. ఈ డాక్యుమెంటరీ నిన్నటి నుంచే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవల ఈ డాక్యుమెంటరీ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా తెరకెక్కించిన నయనతార, విగ్నేష్ సినిమాలోని వర్కింగ్ వీడియోలు వాడటంతో ధనుష్ 10 కోట్లు కట్టమని లీగల్ నోటిస్ పంపించాడు. దీంతో నయనతార ధనుష్ పై విమర్శలు చేస్తూ పబ్లిక్ గా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ డాక్యుమెంటరీపై మరింత హైప్ వచ్చింది.
ఇక ఈ డాక్యుమెంటరీలో మొదటి సగంలో నయనతార ఏం చదివింది, తనకి మొదటి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది?, తన ఫ్యామిలీ గురించి, గజినీ సమయంలో తనను ఎలా బాడీ షేమింగ్ చేసారు, అప్పుడు తాను, తన కుటుంబం ఎంత బాధపడింది, బిల్లా సినిమాలో బికినీ సీన్ గురించి, శ్రీరామరాజ్యం సినిమా చేస్తున్నప్పుడు తనపై వచ్చిన విమర్శల గురించి, శ్రీరామ రాజ్యం సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి, నయనతార మొదటి రిలేషన్ షిప్ లో పడిన బాధ.. ఇవన్నీ చూపించారు. వీటిలో కొన్ని పాయింట్స్ నయనతార చెప్పగా కొన్ని నయనతార తల్లి, నయన్ మొదటి సినిమా డైరెక్టర్, నయన్ మొదటి తమిళ్ సినిమా నిర్మాత, రానా, నాగార్జున, శ్రీరామరాజ్యం సినిమాకు వర్క్ చేసిన టెక్నిషియన్, డైరెక్టర్ అట్లీ.. ఇలా పలువురు నయన్ గురించి మాట్లాడారు.
ఇక డాక్యుమెంటరీలో రెండవ భాగం.. నయనతార శ్రీరామ రాజ్యం తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఎలా సూపర్ స్టార్ అయింది? లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎలా మొదలుపెట్టింది? విగ్నేష్ శివన్ తో తన ప్రేమ కథ ఎలా మొదలైంది? నేను రౌడీనే సినిమా గురించి, విగ్నేష్ శివన్ తో ప్రేమ, పెళ్లి గురించి తెలిపింది. వీటి గురించి సీనియర్ నటి రాధిక, డైరెక్టర్ నెల్సన్, తన పెళ్లి చేసిన నిర్వాహకులు నయనతార గురించి మాట్లాడారు. ప్రస్తుతం నయనతార డాక్యుమెంటరీ వైరల్ అవుతుంది. మీరు కూడా చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయండి.
Also Read : Ram Charan : ఎఆర్ రెహ్మాన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్..