Sandeep Vanga : సందీప్ వంగాతో చిరంజీవి సినిమా పడితే..!
Sandeep Vanga ఆ ఫోటో సందీప్ వంగా ఆఫీస్ లో ఎందుకు ఉంది. ఆ ఫోటో ప్రత్యేకత ఏంటి అని సోషల్ మీడియా అంతా ఒకటే హడావిడి. ఆరాధన సినిమాలోని ఆ ఫోటో చిరంజీవి ఎక్స్ ప్రెషన్ అంటే సందీప్
- By Ramesh Published Date - 11:10 PM, Tue - 4 February 25

Sandeep Vanga : యానిమల్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగా ఎప్పటికప్పుడు మెగాస్టార్ మీద ఉన్న తన అభిమానాన్ని చాటుతూ వస్తున్నాడు. లేటెస్ట్ గా ఆయన ఆఫీస్ లో చిరంజీవి ఫోటో ఒకటి సర్ ప్రైజ్ చేసింది. చిరంజీవి ఆరాధన సినిమాలో పులిరాజు పాత్రలో ఒక వెరైటీ ఎక్స్ ప్రెషన్ తో ఆ ఫోటో ఫ్రేం ఉంది.
అసలు ఆ ఫోటో సందీప్ వంగా ఆఫీస్ లో ఎందుకు ఉంది. ఆ ఫోటో ప్రత్యేకత ఏంటి అని సోషల్ మీడియా అంతా ఒకటే హడావిడి. ఆరాధన సినిమాలోని ఆ ఫోటో చిరంజీవి ఎక్స్ ప్రెషన్ అంటే సందీప్ కి ఇష్టమని అందుకే ఆ ఫోటోని పెట్టుకున్నాడని తెలుస్తుంది.
ఐతే చిరంజీవికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నా ఇలా సందీప్ లా అభిమానించే వారు ఉండేరేమో అనిపించేలా చేశాడు. అంతేకాదు ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి చేతిలో సిగరెట్ తో ఏ రంగు డ్రస్ వేసుకున్నాడు ఎలా డైలాగ్ చెబుతున్నాడు అని చెప్పాడు. అప్పటి నుంచి సందీప్ పక్కా మెగా అభిమాని అని చెబుతూ వచ్చారు. ఐతే సందీప్ వంగా తో మెగాస్టార్ ఒక సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా వేరే లెవెల్ అనిపిస్తుంది. మరి సందీప్ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ లైన్ లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఉన్నారు. సో చిరుతో సినిమా కాస్త టైం పడుతుందని చెప్పొచ్చు.