Pushpa 2 : ‘పుష్ప 2’ లో ఆ సీన్స్ ఏమయ్యాయి..?
Pushpa 2 : సెకండ్ పార్ట్ షూటింగ్ టైంలో.. ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ ఓ వీడియో వదిలి సంచలనమే సృష్టించాడు. ‘పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే అది పుష్పని చూసే’ అన్నారు మంచి ఎలివేషన్ ఉన్న డైలాగ్ అది. కానీ సెకండ్ పార్ట్ లో అది లేదు.
- By Sudheer Published Date - 06:16 PM, Thu - 5 December 24

అల్లు అర్జున్- సుకుమార్ (Allu Arjun – Sukumar) కాంబోలో వచ్చిన పుష్ప 2 (Pushpa 2 )సినిమా నేడు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ మూవీ..విడుదల తర్వాత కూడా అదే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాకపోతే పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 కథ దమ్ము తగ్గి..హీరో ఎలివేషన్ పెరిగింది. అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించారు. అసలు అల్లు అర్జునేనా అనే రేంజ్ లో కుమ్మేసాడు. కాకపోతే సినీ నిడివి ఎక్కువగా ఉండడం , కథ లో దమ్ము లేకపోవడం , సుక్కు మార్క్ స్క్రీన్ ప్లే కనిపించకపోవడం సినిమాకు మైనస్ గా మారాయి. అయితే ‘పుష్ప 2’ లో చాలా ప్రశ్నలకి సుకుమార్ జవాబులు ఇవ్వలేకపోయాడు. మరి సుకుమార్ వాటిని అలా వదిలేసాడు..? లేక మరచిపోయాడా..? అసలు సినిమాలో లేవా..? ఇంకా రన్ టైం ఎక్కువై పోతుందని ఎడిట్ లో తీసేసారా..? అనేది తెలియడం లేదు. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటి..? ఆ సన్నివేశాలు ఏంటి అనేవి చూద్దాం.
పార్ట్ 1 క్లైమాక్స్ లో జాలి రెడ్డి(ధనుంజయ) పాత్రకి సెకండ్ పార్ట్..లో ప్రాముఖ్యత ఉంటుంది అన్నట్టు చూపించాడు. ట్రైలర్లో కూడా ధనుంజయ కనిపించాడు.కానీ సినిమాలో అతని పాత్ర లేదు. ఆ పాత్రకి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో? అలాగే మంగళం శీను(సునీల్) (Sunil) పాత్రని అతని భార్య దాక్షాయణి (అనసూయ) (Anasuya Bhardhwaj) పీక కోసేస్తున్నట్టు చూపించారు. సెకండ్ పార్ట్ లో అతను ఎలా బయటకు వచ్చాడు. అసలు మంగళం శీను- దాక్షాయణి..ల మధ్య కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని సరిగ్గా చూపించలేదు. డైరెక్ట్ గా వాళ్ళు పుష్ప పై రివేంజ్ తీర్చుకోవడం చూపించాడు. సెకండ్ పార్ట్ షూటింగ్ టైంలో.. ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ ఓ వీడియో వదిలి సంచలనమే సృష్టించాడు. ‘పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే అది పుష్పని చూసే’ అన్నారు మంచి ఎలివేషన్ ఉన్న డైలాగ్ అది. కానీ సెకండ్ పార్ట్ లో అది లేదు. అసలు పుష్ప కి బుల్లెట్ తగిలింది అనే సీక్వెన్స్ కూడా లేదు. ‘పుష్ప 2’ లో ఫస్ట్ సీన్లోనే హీరో ఇంట్రడక్షన్ జపాన్లో పెట్టాడు సుకుమార్. ఆ తర్వాత అతనికి ఓ బుల్లెట్ తగలడంతో సముద్రంలో పడిపోయినట్లు చూపించారు. ఆ ట్రాక్ కి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు. ఏది ఏమైనప్పటికి 3 గంటల 28 నిముషాలు కూర్చుపెట్టిన సుకుమార్..దేనికి కరెక్ట్ గా సమాధానం ఇవ్వలేకపోయాడు. మరి వీటికి సమాధానాలు ‘పుష్ప 3 : ది రాంపేజ్’ లో ఏమైనా ఇస్తాడేమో చూడాలి.
Read Also : ISRO PSLV C-59: నిప్పులు చిమురుతూ నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో పీఎస్‌ఎల్వీ సి-59