Adivi Sesh: అడవి శేష్ ఇంట పెళ్లి సందడి.. పెళ్లి పనుల్లో బిజీ బిజీ!
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస హిట్లతో మాంఛి జోరు మీద ఉన్నాడు.
- By Nakshatra Published Date - 09:10 PM, Tue - 24 January 23

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస హిట్లతో మాంఛి జోరు మీద ఉన్నాడు. ఈ మధ్య కాలంలో అతను చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. మేజర్ మూవీతో ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎల్జిబిల్ బ్యాచులర్ గా ఉన్నాడు. ఇప్పుడు అతని ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆగండి.. ఆగండి.. పెళ్లి మనోడుకు కాదు.. వాళ్ల చెల్లికి.
అడివి శేష్ చెల్లి షిర్లీ అడివి పెళ్లిపీటలెక్కుతోంది. ఈ సందర్బముగా హల్ది, మెహందీ వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘చెల్లి పెళ్లిలో అమ్మానాన్న, నేను సంతోషంగా గడుపుతున్నాం. మా బావ డేవిన్ ని మా కుటుంబంలోకి ఆహ్వానించబోతున్నాం’ అంటూ తెలిపాడు.
‘చిట్టి చెల్లికి పెళ్లి జరుగుతోంది. రాజస్థానీ థీమ్ ట్రై చేశాం. పెళ్లి మాత్రం తెలుగు సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది’ అంటూ మరో పోస్ట్ లో రాసుకొచ్చాడు. ఈ వేడుకలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. హిట్ 2 మూవీతో హ్యాట్రిక్ హిట్టులు కొట్టాడు. తాజాగా గూఢచారి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సబంధించిన ఫస్ట్ లుక్ ని ఇప్పటికే విడుదల చేశారు. అడివి శేష్ నటన, పాత్రలు ఎంచుకునే తీరుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నటుడిగానే కాకుండా రైటర్ కూడా అడివి శేష్ తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. చెల్లి పెళ్లి కూడా అవుతున్న తరుణంలో శేష్ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Related News

Sudheer Babu : మహేష్ ని కంగారు పెట్టించిన సుధీర్ బాబు.. ఏం జరిగిందంటే..!
ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) సినిమాల పరంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కావట్లేదు