Vyooham Trailer : సంచలనం రేపుతున్న వ్యూహం రెండో ట్రైలర్..
- By Sudheer Published Date - 06:36 PM, Fri - 15 December 23

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) నుండి వస్తున్న వివాదస్పద చిత్రం వ్యూహం (Vyooham ). వైస్సార్ (YSR) మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటీకే ఈ చిత్ర ట్రైలర్ , పోస్టర్స్ , సినిమా తాలూకా విశేషాలు సినిమా ఫై ఆసక్తి పెంచగా..తాజాగా రెండో ట్రైలర్ (2nd Trailer) విడుదల చేసి సంచలనం రేపారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ట్రైలర్ విషయానికి వస్తే..ఇంతకాలం మిమ్మల్ని పైకి ఎదగనివ్వకుండా తొక్కేసిన మనిషి ఇప్పుడు పైకే పోయాడు. ఇక అంతా మీరే.. అంటూ చంద్రబాబు కు (Chandrababu) చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలైంది. ఓదార్పు యాత్ర (Odarpu Yatra) అంటూ జనం వచ్చింది నాన్న మీద ప్రేమతో కాదు.. ఆయన మరణం తర్వాత కోట్ల మంది నాపై పెట్టుకున్న ఆశకు నేను చలించి పోయాను.. అనే డైలాగ్ తో వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి ట్రైలర్ లో ప్రస్తావించారు.
We’re now on WhatsApp. Click to Join.
నా వెనక ఉండే నీకు నేను చెప్పేది అర్థం కాదు తమ్ముడు.. అని చిరంజీవి (Chiranjeevi) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో అనడం.. అది విని పవన్ కళ్యాణ్ కోపంగా వెళ్తున్నప్పుడు.. కొత్త పార్టీ పెట్టేలా ఉన్నాడు అంటూ చిరంజీవి పక్కన ఉన్న వ్యక్తి చెప్పడం లాంటివి చూపించారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ జరిగిన ప్రచారాన్ని హైలైట్ చేసే విధంగా.. నువ్వు నా గురించి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చెయ్యి ..మీకు ఒక మంచి ప్యాకేజీ ఇస్తాను.. అని చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ తో చెప్పే డైలాగ్ కూడా ట్రైలర్ చూపించి..ఆసక్తి పెంచారు. ఓవరాల్ గా సినిమాలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లను నెగిటివ్ గా చూపించినట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. డిసెంబర్ 29 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సినిమా విడుదల తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.
Read Also : MLC Kavitha: కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ కవిత