Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్
- By Sudheer Published Date - 11:37 AM, Fri - 2 February 24

మెగాస్టార్ ‘విశ్వంభర” నుంచి మెగా అప్డేట్ వచ్చింది. చిరంజీవి (Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిరు 156 మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). సోషియో ఫాంటసీ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్ అవతరిస్తారు’ అంటూ పవర్‌ఫుల్ పోస్టర్‌ను ఈ సందర్బంగా సోషల్ మీడియా లో షేర్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈ మూవీ కోసం చిరంజీవి ఎంతగానో కష్టపడుతున్నారు. తన ఏజ్ ను సైతం పక్కకు పెట్టి.. మరింత ఫిట్‌గా కనిపించడం కోసం చిరంజీవి జిమ్‌లో కసరత్తులతో చెమటోడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన పంచుకోగా వైరలైంది. ‘మెగాస్టార్ స్వచ్ఛమైన ఫాంటసీ జోనర్ చిత్రంలో నటించి మూడు దశాబ్దాలు అవుతోంది. ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు’ అని ఈ సినిమాపై దర్శకుడు అంచనాలు పెంచేశారు. ఇందులో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. కీరవాణి స్వరాలు అందిస్తోన్న ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై రూపొందుతోంది.
ఇక గత ఏడాది వాల్తేరు వీరయ్య , భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చిరు..వీటిలో వాల్తేరు మెగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించగా..భోళా శంకర్ మాత్రం డిజాస్టర్ అయ్యి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
Read Also : Minister Roja : శ్రీవారి సన్నిధానంలో మంత్రి రోజా కు షాక్ ..